అనుష్క శ్రీమతి అవ్వబోతుందా..!

Last Updated on by

అవునా.. ఇదెప్పుడు జ‌రిగింది..? అనుష్క ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది..? ఇంత‌కీ వ‌రుడు ఎవ‌రు..? ఎలా ఉంటాడు.. ఏం చేస్తుంటాడు.. సినిమా వాళ్లేనా.. బ‌య‌టి వాళ్లా..? ఇలా ఒక్క‌రి పెళ్లిపై ఇన్ని వార్త‌లు వ‌స్తాయి క‌దా..! ఎందుకంటే అక్క‌డ ఉన్న‌ది మామూలు హీరోయిన్ కాదు క‌దా.. అనుష్క శెట్టి. 12 ఏళ్లుగా సౌత్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోన్న బ్యూటీ. అందుకే అనుష్క పెళ్లి అంటే అంత ఆస‌క్తి. కొన్నేళ్లుగా అనుష్క పెళ్లిపై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈ భామ పెళ్లిపై వార్త‌లు వ‌చ్చాయి. ఈ సారి ఏకంగా కాస్త క‌న్ఫ‌ర్మేష‌న్ న్యూస్ వ‌స్తుంది.

ఖచ్చితంగా 2018 చివ‌ర్లో అనుష్క పెళ్లి కూతురు కానుంద‌ని తెలుస్తుంది. అనుష్క పేరెంట్స్ కూడా వ‌రుడి కోసం బానే వెతుకుతున్నారు. దొరికిన వెంట‌నే ముడి వేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే అనుష్క‌ కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవ‌డం లేదు. భాగ‌మ‌తి వ‌చ్చి ఆర్నెళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాకు సైన్ చేయ‌లేదు ఈ భామ‌. మ‌ళ‌యాలం నుంచి ఆ మ‌ధ్య ఓ ఆఫ‌ర్ వ‌చ్చినా కూడా నో చెప్పేసింది ఈ బ్యూటీ. దాంతో భాగ‌మ‌తి త్వ‌ర‌లోనే భార్యామ‌ణి కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అందుకే ఈ మ‌ధ్య గుళ్ళు గోపురాల‌కు కూడా బాగానే క‌దులుతుంది ఈ యోగా బ్యూటీ.

User Comments