జాన్ బ‌డ్జెట్ లో కోత‌!

Prabhas' next after Saaho and Jaan

సాహో దెబ్బ తో జాన్ అలెర్ట్ అయ్యాడా? అంటే అవున‌నే స‌మాచారం. ప్ర‌భాస్ న‌టించిన సాహో 350 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తే ఎలాంటి ఫ‌లితాలు దిశ‌గా వెళ్తోందో తెలిసిందే. బాహుబ‌లి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని డ‌బ్బు మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసారు. దాని ఫ‌లితం ఇప్పుడు క‌నిపిస్తోంది. నిర్మాత‌లు సేఫ్ జోన్ లో ఉన్నా బ్రేక్ ఈవెన్ చేయ‌లేదంటే డిస్ర్టిబ్యూట‌ర్ల‌కు తిరిగి చెల్లించ‌క త‌ప్ప‌దు. స్టార్ హీరోల విష‌యం కేవ‌లం న‌మ్మ‌క‌మే పెట్టుబ‌డి కాబ‌ట్టి ఆ కండీష‌న్ పాటించ‌క త‌ప్ప‌దు. సాహో కి అస‌లైన ప‌రీక్ష నేటి నుంచి మొద‌లైంది. ఇప్ప‌టి నుంచి తెచ్చిన వ‌సూళ్లే లెక్క‌లోకి వ‌స్తాయి. కానీ ఆ ప‌రిస్థితి క‌నిపంచ‌లేదు.

ఈ నేప‌థ్యంలో యూవీ క్రియేష‌న్స్ త‌దుప‌రి సినిమా విష‌యంలో అలెర్ట్ అయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో అదే సంస్థ భారీ పెట్టుబడితో జాన్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇట‌లీలో 20 శాతం షూటింగ్ పూర్తిచేసారు. అయితే తాజా అనుభ‌వం నేప‌థ్యంలో జాన్ పెట్టుబ‌డిలో కోత‌లు వేస్తున్న‌ట్లు నిర్మాణ వ‌ర్గాల స‌న్నిహితుల నుంచి తెలిసింది. అన‌వ‌స‌ర ఆర్భాటాలు త‌గ్గించి కేవ‌లం అవ‌స‌ర‌మైన చోటే ఖ‌ర్చుకు కొత్త ప్ర‌ణాళిక వేస్తున్న‌ట్లు వినిపిస్తోంది. ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Also Read : Saaho Four Days Box Office Report