ఆర్జీవీ వ‌ర్సెస్‌ ర్యాంబో

Last Updated on by

కెమెరా .. మెషీన్ గ‌న్ రెండూ ఒక‌టే! ఈ మాట చెప్పింది ఎవ‌రో తెలుసా? ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌. కెమెరా, గ‌న్ కెమెరా రెండూ ఒకే ప‌ని చేస్తాయి. ఇవి రెండూ షూట్ చేసేందుకే.. ఫోటోలు ఒక‌ కెమెరా నుంచి క‌దులుతాయి. బుల్లెట్లు వేరొక కెమెరా నుంచి క‌దులుతాయంతే… ! అంటూ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశాడు. ది గ్రేట్ ర్యాంబో న‌టించిన ఫ‌స్ట్‌బ్ల‌డ్ పోస్ట‌ర్‌(మెషీన్‌గ‌న్ విన్యాసాల పోస్ట‌ర్‌)ని, తాను కెమెరా చేప‌ట్టిన పోస్ట‌ర్‌తో జాయింట్ చేసి .. ఆ ఫోటోకి ఈ ఆస‌క్తిక‌ర‌ కామెంట్‌ని జ‌త‌ చేశాడు.

అంతా బాగానే ఉంది కానీ, ఒక‌వేళ వ‌ర్మ కెమెరాలోంచి పొర‌పాటున ఇమేజెస్ బ‌దులుగా బుల్లెట్లు జారిప‌డితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో? ఆన్ లొకేష‌న్ గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌దూ? తానొక‌టి త‌లిస్తే కెమెరా ఇంకొక‌టి త‌ల‌చింది అన్న చందంగా లొకేష‌న్ టెర్ర‌ర్ ఎటాక్‌తో అదిరిపోదూ..` 26/11 ముంబై ఎటాక్స్`లా అయిపోతుందేమో స‌న్నివేశం. ద్యావుడ‌! వ‌ర్మ అన్నంత ప‌నీ చేయ‌గ‌ల‌డు సుమీ!!

User Comments