వింక్ గాళ్‌కి బ‌న్ని ఆశీస్సులు

వింక్ గాళ్ ప్రియా వారియ‌ర్ న‌టించిన `ఒరు ఆధార్ ల‌వ్` తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నేడు హైద‌రాబాద్ లో జరిగిన ఆడియో ఈవెంట్ లో  కొత్త హీరో రోష‌న్ , ప్రియా వారియ‌ర్ ల‌ను బ‌న్ని ప్ర‌త్యేకంగా బ్లెస్ చేశారు. న‌వ‌త‌రం పెద్ద రేంజుకు ఎద‌గాల‌ని ఆకాంక్షించాడు.
బ‌న్ని మాట్లాడుతూ -“ఈమ‌ధ్య  నేష‌న‌ల్ లెవ‌ల్లో వైర‌ల్ అయిన వీడియో కొల‌వెరిడి.. బాహుబ‌లి హూ కిల్డ్ క‌ట్ట‌ప్ప .. ఆ త‌ర్వాత అంత వైర‌ల్ అయ్యింది ఒరు ఆధార్ ల‌వ్ టీజ‌ర్. నేను సౌతిండియా స్టార్ అని చెప్పుకునేందుకు గ‌ర్విస్తాను.  నేను పుట్టింది హైద‌రాబాద్.. పెరిగింది చెన్న‌య్ .. తెలుగు, త‌మిళంతో పాటు కేర‌ళ‌, క‌ర్నాట‌క‌లోనూ ఆద‌రిస్తున్నారు. అందుకే నేనే సౌత్ ఇండియ‌న్ అని చెప్పుకుంటాను. న‌న్ను మ‌ల‌యాళంలో ఎంతో ఆద‌రించారు. నా సినిమాల్ని వాళ్లు ఆద‌రిస్తున్నందుకు అయినా.. వాళ్ల సినిమాలు మ‌న భాష‌లోకి వ‌చ్చేప్పుడు ఎంక‌రేజ్ చేయాలి క‌దా అనిపించి ఈ వేడుక‌కు వ‌చ్చాను“ అని అన్నారు. వింక్ గాళ్ జ‌స్ట్ లో మిస్స‌య్యింది కానీ, బ‌న్ని స‌ర‌స‌న న‌టించాల్సిందే. ఇక యంగ్ హీరో రోష‌న్ విజువ‌ల్ అప్పియ‌రెన్స్ ఆక‌ట్టుకుంది.