ద‌ర్శ‌క‌సంఘం వర‌కూ వెళ్లాల‌నుకున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోల్లోనే కూలెస్ట్ హీరోగా.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో స‌మానంగా ర‌చ‌యిత‌ల్ని.. టెక్నీషియ‌న్ల‌ను గౌర‌వించే గ్రేట్ ప‌ర్స‌నాలిటీగా మెగాహీరో అల్లు అర్జున్ కి పేరుంది. ఇరుగు పొరుగు హీరోల సినిమాలు స‌క్సెస్ సాధించినా తానే వెళ్లి సెల‌బ్రేట్ చేయ‌డం అల‌వాటు. మంచి క‌థ‌లు దొరికినా.. మంచి ద‌ర్శ‌కుడు తార‌స‌ప‌డినా ఎంక‌రేజ్ చేసే చ‌క్క‌ని మ‌న‌స్థ‌త్వం ఉన్న హీరోగా అత‌డిని అంతా అభిమానిస్తారు. అయితే బ‌న్నికి ఏమైందో కాస్తంత షార్ట్ టెంప‌ర్ కి గుర‌య్యార‌ని ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ఏఏ19 చిత్రానికి ప‌ని చేస్తున్న ఓ సీనియ‌ర్ కోడైరెక్టర్ పై ఉన్న‌ట్టుండి సీరియ‌స్ అయ్యార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అంత‌గా బ‌న్ని ఎందుకు సీరియ‌స్ అయ్యారు? అని ఆరాతీస్తే.. ఆరోజు షూటింగ్ కోసం ప్రిపేర‌వుతున్న బ‌న్నికి స‌ద‌రు కో డైరెక్ట‌ర్ మూడు రోజుల పాటు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింద‌ని చెప్పాడ‌ట‌. అప్ప‌టికే షూటింగ్ కోసం అమెరికా ప‌ర్య‌ట‌న‌ను క్యాన్సిల్ చేసుకున్న బ‌న్నీకి ఆ మాట విన‌గానే వెంట‌నే కోపం వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. ఇంత‌కీ ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డిందా లేదా.. ఒక‌వేళ వాయిదా వేస్తే ఎందుకు వేశారు? అన్న‌దానికి గీతా ఆర్ట్స్ కానీ.. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నుంచి కానీ క్లారిటీ రావాల్సి ఉంటుంది.

త‌న‌పైనే సీరియ‌స్ అయ్యేస‌రికి హ‌ర్ట‌యిన స‌ద‌రు కోడైరెక్ట‌ర్ ద‌ర్శ‌క సంఘాన్ని ఆశ్ర‌యించాల్ని చూసినా మ్యాట‌ర్ లోకి బాస్ అల్లు అర‌వింద్ రంగ ప్ర‌వేశం చేసి కామ‌ప్ చేసేశార‌ని తెలుస్తోంది. ఏదో తాత్కాలికంగా ఇలాంటి కోప‌తాపాలు ఉంటాయి. ఆమాత్రం దానికే ఎందుకీ గొడ‌వ‌లు అని స‌ర్ధుబాటు చేశార‌ట‌. ప్ర‌స్తుతం దీనిపై మీడియాలోనూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొడ‌వ గురించి సాగుతున్న ప్ర‌చారంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. దీనిపై బ‌న్ని స‌న్నిహిత వ‌ర్గాలు ఏమ‌ని చెబుతాయో చూడాలి.