మ‌హేష్‌, బ‌న్నీకి పోటీగా క‌ళ్యాణ్ రామ్

KalyanRam to speak on 118 success

2020 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఇప్ప‌టికే క‌ర్చీప్ వేసేసాయి. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న అల వైకుంఠపురం రిలీజ్ అవుతున్నాయి. వీటికి పోటీగా నట‌సింహ బాల‌కృష్ణ‌- కె.ఎస్ ర‌వికుమార్ సినిమా రిలీజ్ చేయాల‌నుకున్నారు. కాని ఎందుక‌నో ఆ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్నారు. అయితే బాల‌య్య త‌ప్పుకున్నా అబ్బాయి క‌ళ్యాణ్ రామ్ మ‌హేష్‌, బ‌న్నీల‌కు పోటీగా దిగుతున్నాడు.

కల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న‌ ఎంత మంచివాడవురా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్న‌ట్లు అధికారికంగా తెలిపారు. నిజానికి మ‌హేష్‌, బ‌న్నీల‌కు క‌ళ్యాణ్ రామ్ సినిమా పోటీ కాదు. కానీ క‌ళ్యాణ్ రామ్ న‌మ్మ‌కం ఒక్క‌టే. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. సంక్రాంతి ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. అందుకే బ‌రిలోకి దిగుతున్నాడు. ఈనెల 26 నుంచి వచ్చేనెల 22 వరకు సెకెండ్ షెడ్యూల్ ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ లో హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను, నవంబర్ లో చిక్ మంగుళూరులో మ‌రో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తున్నాడు.