ఓటేసిన మెగా ఫ్యామిలీ

తెలంగాణ, ఏపీలో లోక‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ నేటి ఉద‌యం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఓటు హ‌క్కు వినియోగించుకు నేందుకు ఓట‌ర్లు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. ఓటు హ‌క్కును వినియోగిం చుకునేందుకు ప్ర‌జ‌ల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు క‌లిసి వ‌చ్చి ఓటేసారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ విజయవాడలో  ఓటు వేయడం ఆసక్తి రేకెత్తించింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జూబ్లిహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఓటు హ‌క్కు వినియోగించు కున్నారు. అలాగే అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 33లోని బీఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ కు వ‌చ్చి ఓటు వేసారు. బ‌న్నీ వ‌చ్చే స‌మ‌యానికి భారీగా జ‌నం క్యూలో ఉన్న‌ప్ప‌టికీ అంద‌రితో పాటే లైన్ లో నిల‌బ‌డి ఓటేసారు.  మ‌రో న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి ఇదే పోలింగ్ బూతు వ‌ద్ద ఓటేసారు. అనంత‌రం ప్ర‌తీ ఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని కోరారు.  సెల‌బ్రిటీలు లైన్ లో ఉండ‌టం గ‌మ‌నించిన ప్రేక్ష‌కాభిమానులు సెల్పీలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు.

Also Read : Chandra Babu Won Over Rgv!