2.0పై బ‌న్నీవాస్ ఫైర్..

2.0 సినిమా ఏప్రిల్ కు పోస్ట్ పోన్ అయింద‌ని ఈ మ‌ధ్యే వార్త‌లు వినిపించాయి. అది క‌న్ఫ‌ర్మ్ అయింది కూడా. ఏప్రిల్ 13కి 2.0 పోస్ట్ పోన్ అయింద‌నే వార్త‌లు వినిపించాయి. కానీ ఇప్పుడు కాద‌నే కొత్త న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రం వ‌చ్చేది ఏప్రిల్ 13 కాదు.. 27 అంటున్నారు. ఇదే జ‌రిగితే అంత‌కంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. ఎందుకంటే ఆ రోజు మ‌రో రెండు సినిమాలు రానున్నాయి. ఏప్రిల్ 27న అంద‌రికంటే ముందు డేట్ అనౌన్స్ చేసాడు బ‌న్నీ. ఈయ‌న న‌టిస్తోన్న నా పేరు సూర్య అదే రోజు రానుంది. ఈ మేర‌కు నిర్మాత‌లు క‌న్ఫర్మ్ కూడా చేసారు. ఇక మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేను కూడా ఏప్రిల్ 27నే రానుంది. ఈ విష‌యాన్ని ఆ చిత్ర‌యూనిట్ క‌న్ఫ‌ర్మ్ చేసింది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు 2.0 కూడా ఏప్రిల్ 27నే రానుంద‌ని స్టేట్ మెంట్ వ‌చ్చింది.

దాంతో మెగా నిర్మాత బ‌న్నీ వాసుకు బాగా కోప‌మొచ్చేసింది. లైకా ప్రొడక్ష‌న్స్ అంటే త‌న‌కు చాలా గౌర‌వం అని.. అన‌వ‌స‌రంగా 2.0 విడుద‌ల‌ను అటూ ఇటూ జ‌రిపి రీజ‌న‌ల్ సినిమాల భ‌విష్య‌త్తు దెబ్బ తీయొద్ద‌ని కోరాడు బ‌న్నీవాసు. నా పేరు సూర్య‌.. భ‌రత్ అనే నేను ఒకేరోజు వ‌స్తుంటే.. 2.0ను అదే రోజు విడుద‌ల చేయాల‌నుకోవ‌డం క‌రెక్ట్ కాదంటున్నాడు ఆయ‌న. పైగా మ‌హేశ్ సినిమానే ఆయ‌న పోస్ట్ పోన్ చేయించాల‌ని చూస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఈ ముగ్గురూ ఒకేసారి పోటీ ప‌డితే ఎవ‌రికి న‌ష్టం..? ఇవ‌న్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2.0 సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా జ‌రుగుతుంది. స‌్వ‌యంగా శంక‌ర్ నోరు విప్పి చెప్పేవ‌ర‌కు 2.0 విడుద‌ల తేదీపై క‌న్ఫ్యూజ‌న్ మాత్రం కంటిన్యూ కావ‌డం ఖాయం.