హేయ్.. బ‌న్నీ వాసు మ‌ళ్లీ ఏసేసాడు..

బ‌న్నీవాసు.. ఇన్నాళ్లూ సినిమాలు తీసినా కూడా ఈయ‌న పేరు ఎక్కువ‌గా విన‌బ‌డ‌లేదు. కానీ ఒక్క నంది అవార్డుల పుణ్య‌మా అని మ‌నోడి పేరు మొత్తం మార్మోగిపోతుంది. మెగా హీరోలు టీడిపి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలేమో అప్పుడే అవార్డులు వ‌స్తాయంటూ ఈ మ‌ధ్యే వ్య‌గ్యంగా పోస్ట్ చేసాడు బ‌న్నీవాస్. మెగా కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు.. ఇంకా చెప్పాలంటే అల్లు అర‌వింద్ కు మ‌రో ద‌త్త పుత్రుడు.. బ‌న్నీకి ప్రాణ‌మిత్రుడు.. ఇలాంటి నిర్మాత వాళ్ల అనుమ‌తి లేకుండానే ఇంత పెద్ద లైన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాడా..? బ‌న్నీవాసు చేసిన కామెంట్స్ చాలా చ‌ర్చ‌ల‌కు దారి తీసాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి పోసాని వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయాడు ఈ కుర్ర నిర్మాత. ఈ సారి కూడా త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసాడు బ‌న్నీవాసు.

Bunny Vasu Supports Posani Krishna Murali
నంది అవార్డుల‌పై మాట్లాడిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌ని ఈ నిర్మాత‌.. ఇప్పుడు పోసాని మాట్లాడ‌టంతో త‌న గ‌ళాన్ని కూడా తోడు చేసాడు. పోసాని వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. పోసాని గారూ.. సార్ మీరు 100 శాతం ఆ అవార్డుకు అర్హులు. మనం ఏపీలో పుట్టాం. ఏపీలో పెరిగాం.. అమెరికాలో కాదు. ఏపీలోనే చదువుకున్నాం.. అమెరికాలో కాదు. మన యాస ఏపీదే.. మనం ఏపీ వాళ్లమని ఇప్పుడు ప్ర‌త్యేకంగా రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ బ‌న్నీ వాసు రాసుకొచ్చాడు. అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేసే వాళ్లంతా నాన్ లోక‌ల్.. నాన్ ఆంధ్రా అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా ఈ పోస్ట్ చేసాడు బ‌న్నీవాసు. పైగా నంది అవార్డుల ప్రకటన వచ్చిన త‌ర్వాత ఇండ‌స్ట్రీ మొత్తం మీద దానిపై విమ‌ర్శ‌లు చేసి.. వెలుగులోకి తీసుకొచ్చింది బ‌న్నీవాసే. ఆయ‌నే నోరు తెరిచి ఉండ‌క‌పోతే చాలా నోళ్లు ఇప్ప‌టికీ మౌనంగానే ఉండేవేమో..?