Last Updated on by
స్క్రిప్టు ఎంపిక నుంచి.. ఎడిట్ టేబుల్‌పై ఫైనల్ కట్ వరకూ ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయడంలో బాస్ అల్లు అరవింద్‌ని కొట్టేవాళ్లే లేరు. సినిమా జయాపజయాల్ని శాసించే బాసిజం ఆయనకే చెల్లింది. ఇండస్ట్రీలో దశాబ్ధాల సుదీర్ఘ అనుభవంతో ఆయన ఏ సినిమా ఎలాంటి ఫలితం అందుకోగలదో ముందే చెప్పేయగలిగే సమర్ధుడు. అయితే అంతటి సమర్ధుడు చెప్పిన మాటను పెడ చెవిన పెట్టి బన్ని ఘోరతప్పిదం చేశాడా? అంటే అవుననే తెలుస్తోంది. `నా పేరు సూర్య` బాక్సాఫీస్ వద్ద విఫలమవ్వడానికి బన్ని, అతడి స్నేహితుడు కం నిర్మాత బన్ని వాసు తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. ఆ ఇద్దరూ తమ దర్శకుడు వక్కంతం వంశీని డిపెండ్ చేసే క్రమంలో బాస్ అల్లు అరవింద్ ఎనాలిసిస్‌ని పక్కనబెట్టేశారట. ఆ క్రమంలో చిన్నపాటి ఘర్షణ తలెత్తిందని చెబుతున్నారు.
పుత్ర రత్నం బన్ని కెరీర్‌పై ఎంతో శ్రద్ధ చూపించే అల్లు అరవింద్ .. ఈసారి కూడా యథావిధిగా ఎడిట్ టేబుల్‌పై ఎన్‌పీఎస్‌ని పరిశీలించారట. అందులో తప్పేంటో కూడా కనిపెట్టారట. ఈ సినిమా ద్వితీయార్థం అంత గ్రిప్పింగ్‌గా లేదని, కొన్నిటిని ట్రిమ్ చేసి, సీన్లు మార్చాలని సూచించారట. అయితే అందుకు బన్ని, బన్నివాస్ ససేమిరా అన్నారట. వక్కంతం ఏం చెబితే అదే విన్నారట. ఇంకేం ఉంది ఫలితం కూడా అలానే రివర్స్ అయ్యింది. ఏదైతేనేం.. ఇప్పటికి వక్కంతం వంశీకి ప్రాక్టీస్ పూర్తయింది. తదుపరి మరో అవకాశం వస్తే గనుక వెంటనే నిరూపించుకుంటాడనడంలో సందేహం లేదు.
User Comments