టాలీవుడ్‌లో కుల‌రాజ‌కీయం

Last Updated on by

వైయ‌స్సార్ జీవిత‌క‌థ ఆధారంగా యాత్ర తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌మ్ముట్టి టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నారు.
ఆనందో బ్ర‌హ్మ ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ప‌లువురు క్రేజీ నాయిక‌లు న‌టించ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. అదంతా అటుంచితే ఈ సినిమాపై ప్ర‌ముఖ టీవీ చానెల్ లైవ్ చేసిన క‌థ‌నం టాలీవుడ్‌లో వేడి పుట్టించింది. ఈ క‌థ‌నం సారాంశం ప్ర‌కారం.. యాత్ర చిత్రానికి పెట్టుబ‌డులు పెట్టేది వైయ‌స్సార్ వాళ్లు కాదు, కాంగ్రెస్ వాళ్లు అన్న వాద‌న తెర‌పైకి తెచ్చింది. ఇక ఇన్నాళ్లు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న మైనార్టీలు ఈ సినిమా చూశాక వైసీపీకి, జ‌గ‌న్‌కి దూర‌మైపోతార‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. మొత్తానికి రాజ‌కీయాలు అర్థం కాని వాళ్ల‌కు అర్థ‌మ‌య్యేలా వండి వార్చిన ఈ క‌థ‌నం వ‌ల్ల ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పూర్తిగా టాలీవుడ్‌పై రాజ‌కీయం చేస్తున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇన్నాళ్లు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ పూర్తిగా క‌లుషితం కాలేదు. పొలిటిక‌ల్ రివల్యూష‌న్స్ ఉన్నా, ఇప్పుడు అది పూర్తిగా కుల రాజ‌కీయాల కౌగిలిలోకి వెళ్లిపోతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి స‌న్నివేశం ఎంతో ప్ర‌మాద‌క‌రం. అది న‌టీన‌టులు స‌హా అన్ని శాఖ‌ల వారికి పెనుముప్పున‌కు సంకేతం అని అంతా విశ్లేషిస్తున్నారు. కేవ‌లం కోలీవుడ్‌లోనే ఇలాంటి పొలిటిక‌ల్ కుంప‌టి ఉండేది. ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్‌లోనూ కులరాజ‌కీయాలు రెచ్చ‌గొడుతున్న వైనం క‌నిపిస్తోందని ప‌లువురు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇక వైయ‌స్ బ‌యోపిక్‌పై ఒక చానెల్ విష‌యం చిమ్మితే ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనా అవ‌త‌లి కులం విషం చిమ్మ‌కుండా ఉంటుందా? అంటూ ఒక‌టే వేలెత్తి చూపిస్తున్నారు. మొత్తానికి స‌మిధ అవుతోంది మాత్రం టాలీవుడ్‌!!

User Comments