ఆర్జీవీపై కులం కుట్ర‌

RGV (Source: Google)

వ‌ర్మ వ‌ర్సెస్ ఇండ‌స్ట్రీ.. ప్ర‌స్తుతం హాట్ టాపిక్ ఇది. ప‌రిశ్ర‌మ‌లో అంత‌ర్గ‌త‌ వార్  న‌డుస్తోంద‌ట‌. కులం పేరుతో సినిమాలు తీస్తున్న‌ వ‌ర్మ‌ను అష్ట‌దిగ్భంద‌నం చేయాల‌ని ఇండ‌స్ల్రీ పెద్ద‌లు ప్లాన్ చేసార‌ట‌. వ‌ర్మ శ‌త్రువులంతా ఏక‌మై కుట్ర చేసార‌న్న‌ది ఇన్ సైడ్ టాక్. మెగా ఫ్యామిలీతో వివాదాలు..ప‌లువురి సెలబ్రిటీల‌పై త‌న దైన మార్క్ విమ‌ర్శ‌ల‌తో చాలా మందితోనే ఆర్జీవీ శత్రుత్వం పెట్టుకున్నాడు. కానీ వ‌ర్మ ఏ రోజూ దేనికీ భ‌య‌ప‌డ‌డు. ధైర్యంగా ముందుకెళ్తాడు. వివాదాలు ఎదురైనా..శ‌త్రుసైన్యం దూసుకొచ్చినా వ‌న్ మేన్ ఆర్మీలా పోరాడ‌తాడు.

కానీ ఆ తెగింపు ఫ‌లితం వ‌ర్మ అనుభ‌విస్తున్నాడు అన్న‌ది కొంద‌రి అభిప్రాయం. వ‌ర్మ సినిమాలేవి రిలీజ్ చేయ‌నీకుండా బ్యాకెండ్ లో పెద్ద ఆప‌రేష‌న్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. అందుకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మ‌రింత ఆస్యం పోసింద‌ని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ రాజ‌కీయ క‌థను చెప్పే భాగంలో చంద్ర‌బాబు నాయుడిని వ‌ర్మ టార్గెట్ చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా చేయ‌డ‌మే వ‌ర్మ చేసిన అతి పెద్ద త‌ప్పు అని పెద్ద‌లు మండి ప‌డ్డార‌ట‌. అందుకే ఆ సినిమాను వ‌ర్మ స‌వ్యంగా రిలీజ్ చేయ‌లేక‌పోయాడు. అప్ప‌ట్లో  ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కు థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తింది.

ఈ సినిమాకు థియేట‌ర్లు ఇవ్వ‌డానికి నిర్మాత కం పంపిణీ దారుడు సురేష్ బాబు ముందుకు రాలేదని ఓ రూమ‌ర్  ఉంది. అల్లు అర‌వింద్ కూడా మెగా ఫ్యామిలీపై చేసిన విమ‌ర్శ‌లు కార‌ణంగా దూరం పెట్టిన‌ట్లు వార్తలొచ్చాయి. ఇక దిల్ రాజు సురేష్ బాబు, అర‌వింద్ మాట‌ను కాద‌ని ముందుకు వెళ్ల‌డు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా వెన‌క్కి త‌గ్గాడు. దీంతో వ‌ర్మకు ఉన్న అతికొద్ది ప‌రిచ‌యాల‌తోనే ఆ సినిమాను రిలీజ్ చేయ‌గ‌లిగాడు. అంత‌కు ముందు వంగవీటి అనే సినిమా చేసాడు. ఆ సినిమా విష‌యంలోనూ ఇదే స‌న్నివేశం చోటు చేసుకుందిట‌. కులాల్ని ప్ర‌స్థావించి సినిమాలు చేసే వ్య‌క్తిని ప్రోత్స‌హించ‌డం అంద‌రి భ‌విష్య‌త్ కు ఇబ్బందిక‌ర‌మ‌ని భావించి ఆ ముగ్గురు ముందుకు రాలేదుట‌. ఆస‌క్తిక‌ర‌మైన విషయం ఏమంటే ఆర్జీవీ ప‌దే ప‌దే ఓ కులాన్ని టార్గెట్ చేయ‌డంతో వాళ్లు ఉచ్చు వేసి ఇత‌ర కులాల్ని కూడా సాయ‌ప‌డ‌నీకుండా చేస్తున్నార‌ని మ‌రో టాక్ ఇన్ సైడ్ బ‌లంగా వినిపిస్తోంది.  దీనిపై సినీమీడియాలోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.