సైరాపై సెల‌బ్రిటీల మాటేంటి?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి నేడు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సైరా బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌నే రివ్యూలు చెబుతున్నాయి. మ‌రి ఈ సినిమాపై టాలీవుడ్ సెల‌బ్రిటీ మాటేంటి? అందులోనూ దిగ్ధ‌ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రియాక్ష‌న్ ఎలా ఉంది? అంటే వాళ్ల ట్విట‌ర్ ఖాతాల‌ను కెల‌కాల్సిందే.

చిరంజీవి గారు ఉయ్యాల‌వాడ పాత్ర‌కు ప్రాణం పోసారు. మరుగ‌ను ప‌డిన చ‌రిత్ర‌ను ఆయ‌న వెలికి తీసారు. జ‌గ‌ప‌తిబాబు, , సుదీప్, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార, త‌మ‌న్నా పాత్ర‌లు క‌థ‌లో నిమ‌గ్న‌మ‌య్యాయి. సినిమా అద్భుత విజ‌యం సాధించిందని రాజ‌మౌళి ట్వీట్ చేసారు. ఇక హ‌రీష్ శంక‌ర్ ఏమ‌న్నారంటే? ఈ రోజు చ‌రిత్ర మ‌ళ్లీ పుట్టింది. అది చిరంజీవిది అయింది. సూరి ప‌నిత‌నం అద్భుతం. చ‌ర‌ణ్ కు హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేసాడు. న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో చిరంజీవి జీవించారు. మ‌మ్మ‌ల్ని చ‌రిత్ర పుట్ట‌లోకి తీసుకెళ్లారని ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల అన్నారు. సైరా లో భావోద్వేగాలు, మెగాస్టార్ న‌ట‌న‌, విరామానికి ముందు వ‌చ్చ పోరాట ఘ‌ట్టం అద్భుతం. నిర్మాణ విలువలు గొప్ప‌గా ఉన్నాయ‌ని న‌టుడు సుధీర్ బాబు అన్నారు. ఇంకా నిర్మాత శోభుయార్ల‌గ‌డ్డ‌, అల్లు శిరీష్ సైరా విజ‌యంపై ఆనందం వ్య‌క్తం చేసారు.