800 సినిమాల‌కు సెన్సార్ నో

Last Updated on by

ఏ భాష‌లో సినిమా తీసినా సెన్సార్ కంప‌ల్ స‌రీ. సెన్సార్ క్లీన్ చీట్ ఇస్తేనే సినిమా రిలీజ్ అయ్యేది. లేదంటే ఎలాంటి సినిమా అయినా అక్క‌డ మ‌గ్గిపోవాల్సిందే. సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి సెన్సార్ నిబంధ‌న అనేది భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో అమ‌లులో ఉంది. వీలైనంత వ‌ర‌కూ సెన్సార్ సానుకూల దృక్ఫ‌ధంతోనే వ్య‌వ‌రిస్తుంటుంది. సినిమా రిలీజ్ అడ్డు పుల్ల వేడ‌యం అనేది చాలా రేర్ గా జ‌రుగుతుంటుంది. కానీ గ‌డిచిన 16 ఏళ్ల‌లో దాదాపు 800 సినిమాలు సెన్సార్ కు నోచుకోలేద‌ట‌. అంటే అర్హ‌త లేని సినిమాలు గా ప్రేక్ష‌కులు చూడ‌లేని సినిమాలుగా వాటిని సెన్సార్ ధృవీక‌రిచింది. ఈ విష‌యం స‌మాచార హ‌క్కు చ‌ట్టం లో ఓ స‌న్నిహితుడు ద్వారా తెలిసింది.

800 సినిమాల్లో 586 భార‌తీయ సినిమాలు, 207 విదేశీ సినిమాలు ఉన్నాయి.231 హిదీ సినిమాలు, 96 త‌మిళ సినిమాలు, 53 తెలుగు సినిమాలు, 39 క‌న్న‌డ సినిమాలు, 17 పంజాబీ సినిమాల‌కు సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌క‌పోవ‌డంతో నిలిచిపోయాయుట‌. అప్ప‌ట్లో ఈ సినిమా ద‌ర్శ‌కులు ఎలాగైనా సెన్సార్ ప‌ట్టా పొందాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేసినా వీలు ప‌డ‌లేదు. దీంతో ఇక లాభం లేద‌నుకుని…తిరిగి రిగిరి చెప్పులు అడ‌రిగిపోవ‌డం, డ‌బ్బు బృద్ధా త‌ప్ప‌! చేసేదేమీ లేద‌ని వాటిని సెన్సార్ ఆఫీస్ లోనే వ‌దిలేసారుట‌. సాధార‌ణంగా సినిమాల్లో ప‌రిమితికి మంచి అశ్లీల స‌న్నివేశాలు, నేర పూర్తి ఘ‌ట‌న‌లు, నేత‌ల‌ను విమ‌ర్శించ‌డం, స‌మాజంపై ప్ర‌భావం చూపే సినిమాల‌కు సెన్సార్ నో చెబుతుంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Also Watch: Actress Rakul Preet Singh Latest Stills

User Comments