బాలయ్య సైగ.. సెన్సార్ కటింగా..?

censor trouble balayya mannerism paisa vasool

టాలీవుడ్ సినిమాలు ఈ మధ్య ఆ విషయంలో కూడా బాలీవుడ్ ను ఫాలో అయిపోతూ రియలిస్టిక్ పేరు చెప్పి బూతులు, ఇంటిమేట్ సీన్లతో నిండిపోతున్న విషయం తెలిసిందే.

అందులోనూ పూరీ జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ అయితే ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారని తెలుసు. అయితే, సినిమాకు అవి అవసరమైన మేరకు ఉంటే పర్లేదు.

కానీ, కథకు సంబంధం లేకుండా ఇరికిస్తేనే, చూడటానికి చిరాగ్గా ఉంటుంది. అందుకే మరి సెన్సార్ బోర్డు వూరికే ఉంటుందా.. అలాంటి వాటికి కత్తెరలు వేస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బాలయ్య హీరోగా నటిస్తోన్న ‘పైసా వసూల్‘ సినిమా ట్రైలర్ లో బాలయ్య ఒక ఫైట్ సీన్ లో బయట జనాలు బూతుగా పరిగణిస్తున్న ఒక సైగను వాడటంపై రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మామూలుగా బూతు డైలాగ్ అయితే, సౌండింగ్ తో మేనేజ్ చేస్తారు.

కానీ, ఇది సైగ కావడంతో.. తాజాగా సెన్సార్ వాళ్ళు కొన్ని సూచనలు చేశారని ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా బూతును తలపించే ఆ సైగలను తొలగిస్తేనే సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని సెన్సార్ వాళ్ళు చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు పైసా వసూల్ కు కొన్ని కత్తిరింపులు జరుగుతున్నాయని అంటున్నారు.

మరోవైపు, సినిమాలో ఆ రకమైన సైగను బాలయ్య ఆ ఒక్క దగ్గరే కాదని, సినిమా అంతా అదో మేనరిజంగా చేస్తాడని టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

అందులోనూ ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కావడం, బాలయ్య మాఫియా డాన్ గా నటిస్తుండటం చూస్తుంటే.. సినిమాలో ఇంకెన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయోననే అనుమానం కలగడం కామన్.

మరి ఆ లెక్కన నిజంగా సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో చూడాలి.

Follow US