ఛాపాక్ ట్రైల‌ర్ టాక్: ఉయ్ వాంట్ జ‌స్టీస్

యాసిడ్ దాడి బాధితురాలు  నిర్భ‌య (ల‌క్ష్మీ అగ‌ర్వాల్) జీవిత క‌థ ఆధారంగా బాలీవుడ్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం `ఛ‌పాక్`. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో దీపికా ప‌దుకొణె న‌టిస్తోంది. `రాజీ` ఫేం మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ మంగ‌ళ‌వారం విడుదల చేసారు. మాకు న్యాయం కావాలి అంటూ యువ‌త చేస్తోన్న ఆందోళ‌న‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతోంది.
ఓ యువ‌కుడు దీపిక‌(మాల‌తి) ముఖంపై యాసిడ్ దాడి చేయ‌డంతో తొలుత కుంగిపోతుంది. అటుపై ఆత్మ విశ్వాసం కూడ‌గ‌ట్ట‌కుని న్యాయం కోసం చేసిన పోరాట స‌న్నివేశాలు స్పూర్తిని నింపేలా ఉన్నాయి. యాసిడ్ అమ్మ‌డం మానేస్తే బాగుంటుంది. ఈ దాడులలే ఉండ‌వంటూ దీపిక ఆవేద‌నతో  చెప్పే డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి. అత‌డు నా ముఖాన్ని నాశ‌నం చేసాడు. నా ఆత్మ విశ్వాసాన్ని కాదని దీపిక ట్రైల‌ర్ చివ‌ర్లో చెప్పే డైలాగ్ హైలైట్ గా  ఉంది.
కేసు విచార‌ణ‌లో భాగంగా పోలీసుల ఇన్వ‌స్టిగేష‌న్, సెష‌న్స్ కోర్టు, హైకోర్టు అటుపై సుప్రీంకోర్టు విచార‌ణ అనంత‌రం మ‌ర‌ణ‌దండ‌న తీర్పుకు సంబంధించిన స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా మ‌లిచిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ట్రైల‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. హైద‌రాబాద్ దిశ ఘ‌ట‌న నేప‌థ్యంలో ట్రైల‌ర్ రావ‌డం సినిమాకు మ‌రింత క‌లిసొచ్చే అంశం. ఛ‌పాక్ జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానుంది.