డైలమాలో చై-ప‌ర‌శురాం ప్రాజెక్ట్

Naga Chaitanya - File Photo

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య‌ క‌థానాయ‌కుడిగా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే బాలీవుడ్ సినిమా చిచ్చోరేని రీమేక్ చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగింది. అందులో వాస్త‌వం ఎంత అన్న‌ది క్లారిటీ లేదు గానీ! ఆ కాంబోలో ఓ చిత్రాన్ని మాత్రం 14 రీల్స్ నిర్మించ‌డానికి రెడీ అయింది. తాజాగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి మ‌రింత లోతైన స‌మాచారం అందింది. స్టోరీ విష‌యం ప‌క్క‌న‌బెడితే ఈ సినిమాకు ప‌రుశురాం పారితోషికంగా 8 కోట్లు, చైత‌న్య రెమ్యున‌రేష‌న్ 7 కోట్లు అట‌. ఇక మేకింగ్ కాస్ట్ 20 నుంచి 25 కోట్ల మ‌ధ్య‌లో ఖ‌ర్చు అవుతుంద‌ని భావిస్తున్నారు.

ఇలా తొలి కాపీ చేతికి వ‌చ్చే స‌రికి 40 కోట్లుగా లెక్క తేలిందిట‌. ఇంకా ప్ర‌చారానికి  కోటిన్న‌ర నుంచి రెండు కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారుట‌. మొత్తంగా సినిమా థియేట‌ర్లోకి రావ‌డానికి 50 కోట్లు ఖ‌ర్చు గా తేల్చారుట‌. అయితే సినిమా ప్రారంభానికి ముందే ఇంత ఖ‌ర్చు రావ‌డంతో స‌ద‌రు నిర్మాణ సంస్థ డైలమాలో ప‌డిన‌ట్లు స‌మాచారం. చై మార్కెట్ గ‌తం క‌న్నా కాస్త మెరుగుప‌డినా, ప‌రుశురాం 100 కోట్లు వ‌సూళ్లు తెచ్చిన సినిమా తీయ‌గ‌లిగినా ఆ ఇద్ద‌రిని న‌మ్మి 50 కోట్లు పెట్ట‌డం అంటే రిస్క్ అవుతుంద‌ని ఆలోచ‌నలో ప‌డ్డారుట‌.