చైసామ్ పెళ్లి ముచ్చ‌ట్లు..

ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్న పెళ్లి జ‌రిగిపోయింది. మూడేళ్ల ప్రేమ‌కు మూడు ముళ్ళ‌తో ముగింపు ప‌లికారు స‌మంత‌-నాగ‌చైత‌న్య‌. ఈ ఇద్ద‌రి పెళ్లి క‌న్నుల పండ‌గ‌గా జ‌రిగింది. గోవాలో జ‌రిగిన ఈ పెళ్లి ముచ్చ‌ట్లుగా ఆల్బ‌మ్ రూపంలో ఒక్క‌సారి చూద్దాం..

ChaiSam Marriage Highlights

తొలిరోజు.. అక్టోబ‌ర్ 5 రాత్రి..
అక్టోబ‌ర్ 6న స‌మంత‌-చైతూ పెళ్లి జ‌రిగింది. కానీ ఆ ముందు రోజంతా అక్కినేని వారి సంద‌డితో గోవా అదిరిపోయింది. ఆకాశ‌మంత పందిరి వేసి.. వేలాది మంది ఆశీర్వాదాల‌తో జ‌రిగే పెళ్లిళ్లలా అంగరంగ వైభవంగా జ‌రిగాయి అనుకుంటే పొర‌పాటే. వంద మందే ఉన్నా.. చిన్ని పందిరే ఉన్నా కూడా అంగ‌రంగ వైభ‌వం అంటే ఎలా ఉంటుందో చూపించారు అక్కినేని కుటుంబం. చైతూ-స‌మంత పెళ్లికి ముందు రోజు సంగీత్ అదిరిపోయే రేంజ్ లో జ‌రిగింది. మామ‌య్య నాగార్జునతో పాటు కాబోయే భ‌ర్త నాగ‌చైత‌న్యతో క‌లిసి స‌మంత ఇచ్చిన పోజులు అబ్బో అద్భుత‌మే. ఇదే సంగీత్ లో కొత్త కూతురుతో క‌లిసి సురేష్ బాబు వేసిన స్టెప్పులు పీక్స్.

ChaiSam Marriage Highlights 01

అక్టోబ‌ర్ 5.. ఫోటోషూట్ డే..
పెళ్లికి ముందు రోజే ఫోటోషూట్ల‌కు కూడా పోజిచ్చింది స‌మంత‌. అంతేకాదు.. పెళ్లికి వ‌చ్చిన ప్ర‌తీ గెస్ట్ తోనూ త‌న‌దైన శైలిలో సెల్ఫీలు దిగారు కొత్త జంట‌. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి వెన్నెల కిషోర్.. అడ‌వి శేష్.. చిన్మ‌యి.. రాహుల్ రవీంద్ర‌న్.. ఇలా అతికొద్ది మంది మాత్ర‌మే ఈ వేడుకకు వ‌చ్చారు. వెన్నెల కిషోర్ తో స‌మంత‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. ఫోటోల్లోనూ ఈ రిలేష‌న్ బ‌య‌ట‌ప‌డుతుంది. ఇక స‌మంత‌కు గాత్ర‌దానం చేసిన చిన్మ‌యి కూడా ఈ పెళ్లిలో భ‌ర్త‌తో క‌లిసి స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. ఇక స‌మంత ఆరోప్రాణం నీర‌జ‌కోన కూడా ఫ్రెండ్ పెళ్లిలో సంద‌డి చేసింది. ఇదే పెళ్లికి ముందు రోజు హైలైట్స్.

ChaiSam Marriage Highlights 001

అక్టోబ‌ర్ 6.. పెళ్లి రోజు..
స‌మంత‌-నాగ‌చైత‌న్య మూడేళ్ల క‌ల‌కు రూపం ఆ రోజు. ఎప్పుడెప్పుడు ఒక్క‌ట‌వుతారా అని అభిమానుల ఎదురుచూపుల‌కు రూపం కూడా ఆ రోజే. అంతేకాదు.. స‌మంత‌-నాగ‌చైత‌న్య‌పై ఎన్నో రూమ‌ర్లు వ‌చ్చాయి. వీళ్లిద్ద‌రి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వ‌స్తుందా రాదా అనే ఎన్నో అనుమానాలు. వీటన్నింటికీ తెర‌దించేస్తూ.. అక్టోబ‌ర్ 6 రాత్రి 11.52 నిమిషాల‌కు ఒక్క‌ట‌య్యారు. త‌న మెడ‌లో తాళి ప‌డ‌గానే చిన్న‌పిల్ల‌లా ఆనంద భాష్పాలు కార్చేసింది స‌మంత‌. అక్కినేని కుటుంబంలో స‌భ్యురాలు అయిపోయింది. ఇక ఇదే పెళ్లిలో అక్కినేని కుటుంబం అంతా క‌లిసి స‌మంత‌ను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించే వీడియో పెళ్లికే హైలైట్ గా నిలిచింది.

ChaiSam Marriage Highlights 002

అక్టోబ‌ర్ 7.. తెల్ల‌వారుఝాము.. పెళ్లి త‌ర్వాత పార్టీ..
హిందూ సంప్ర‌దాయంలో పెళ్లి జ‌రిగిన త‌ర్వాత అదే రోజు రాత్రి ఫుల్ ఎంజాయ్ చేసారు అక్కినేని, ద‌గ్గుపాటి కుటుంబ స‌భ్యులు. మ‌రీ ముఖ్యంగా నాగ‌చైత‌న్యతో పాటు నాగార్జున‌, వెంక‌టేశ్, సురేష్ బాబు కూడా ఈ పార్టీలో డాన్సులు చేసారు. ఇక అఖిల్, రానా కూడా త‌మదైన శైలిలో చిందులు వేసారు. బామ్మ‌ర్దితో క‌లిసి రానా దిగిన ఫోటోలు కూడా బాగా వైర‌ల్ అయ్యాయి.

ChaiSam Marriage Highlights 003

అక్టోబ‌ర్ 7.. సాయంత్రం 5.30 ని..
హిందూ సంప్ర‌దాయంలో పెళ్లి.. ఆ త‌ర్వాత పార్టీ కూడా పూర్తైపోయింది. ఇక అక్టోబ‌ర్ 7న క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తిలో ఒక్క‌ట‌య్యారు స‌మంత-చైతూ. ఆ ఏసు ప్ర‌భువు దీవెన‌లు తీసుకుంటూ.. మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అనిపించుకున్నారు. ఇక కోట్ లో నాగ‌చైత‌న్య‌- ఏంజిల్ లా స‌మంత క‌లిసొస్తుంటే అక్క‌డున్న వాళ్ల దిష్టే తగిలేసిందేమో అన్నంత‌గా మెరిసిపోయారు.

ChaiSam Marriage Highlights 004

అక్టోబ‌ర్ 7.. రాత్రి.. ఆఫ్ట‌ర్ పార్టీ..
క్రిస్టియ‌న్ వెడ్డింగ్ అయిన త‌ర్వాత స‌మంత‌-నాగ‌చైత‌న్య నేరుగా పార్టీకి వెళ్లిపోయారు. అక్క‌డే ఉన్న రిసార్ట్ లో ఆఫ్ట‌ర్ పార్టీ జ‌రిగింది. నాగార్జున‌తో పాటు వెంక‌టేశ్ కూడా ఈ పార్టీలో డాన్సులు వేసారు. ఇక అఖిల్ అయితే అన్న పెళ్లిని మ్యాగ్జిమ‌మ్ ఎంజాయ్ చేసాడు. మొత్తానికి మూడేళ్ల ప్రేమ ఇలా మూడుముళ్లు.. ఏడ‌డుగుల‌తో ముగించేసారు అక్కినేని నాగ‌చైత‌న్య అండ్ అక్కినేని స‌మంత‌.

ChaiSam Marriage Highlights 005