భ‌ర్త స‌పోర్టుతోనే ఇదంతా

Last Updated on by

పెళ్లి త‌ర్వాత భ‌ర్తే దైవం. భ‌ర్త స‌పోర్టు చాలా ముఖ్యం. అది లేనిదే ఏదీ చేయ‌లేమ‌ని స‌మంత అన్నారు. త‌న‌కు చైతూ నుంచి కావాల్సినంత స‌పోర్టు ఉంద‌ని అన్నారు. అంతేకాదు.. పెళ్లి త‌ర్వాత న‌టిస్తున్న ందుకు అంద‌రూ అభినందిస్తున్నారు. ప్ర‌స్తుత‌ కెరీర్ బావుంద‌ని తెలిపారు. ఇంకో నాలుగు హిట్లు అందుకోవాల్సి ఉంది అని అన్నారు స‌మంత‌. ఈ భామ న‌టించిన `యుట‌ర్న్` హ‌బ్బీ నాగ‌చైత‌న్య న‌టించిన `శైల‌జారెడ్డి అల్లుడు `చిత్రానికి పోటీగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే ప్ర‌శ్న అడిగితే సామ్ ఆస‌క్తిక‌రంగా స్పందించింది.

చైత‌న్య సినిమా నా మూవీ ఒకే తేదీలో విడుదల అవుతుంటే లోన‌ చిన్న ఒత్తిడి ఉంది. అసలు ఇలా రిలీజ్ చెయ్యాలని మేమెప్పుడూ అనుకోలేదు. కానీ యూ టర్న్ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదలవుతున్న కారణంగా, రిలీజ్‌ తేదీని మార్చడం కుదరలేదు. మా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా అయితే, చైతు హ్యాపీనెస్ కి మించి నాకు ఏదీ ఎక్కువ కాదు… అని స‌మంత అన్నారు.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెలుగులోనూ పెరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. సోనమ్ కపూర్, అనుష్కా శర్మ, జ్యోతిక పెళ్లి తర్వాత కూడా సంతోషంగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు. పరిశ్రమలో ఇది చాలా మంచి పరిణామమిది. మునుముందు ఇది మ‌రింత పెరుగుతుంది. నాకు అభినంద‌న‌లు ద‌క్కుతున్నాయి అన్నారు.

User Comments