ఛాలెంజ్ 2? అభిలాష 2?

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ క్లాసిక్స్ అభిలాష‌, ఛాలెంజ్‌. ఈ చిత్రాల్ని 90ల‌లో కె.ఎస్‌.రామారావు నిర్మించారు. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్‌కి అత్యంత స‌న్నిహితుడిగా.. మెగా నిర్మాత‌గా కె.ఎస్ పాపులారిటీ రెట్టింపైంది. అభిరుచిగ‌ల నిర్మాత‌గానూ కె.ఎస్‌.రామారావుకు పేరు తెచ్చిన చిత్రాలివి. మెగాస్టార్ కెరీర్‌లో క‌లికితురాయి అని చెప్పుకోద‌గ్గ చిత్రాలుగానూ అభిలాష‌, ఛాలెంజ్‌ పాపుల‌ర‌య్యాయి. రిలీజై ద‌శాబ్ధాలు గ‌డుస్తున్నా బుల్లితెర‌పై ఇప్ప‌టికీ ఈ చిత్రాలు విశేష ఆద‌ర‌ణ పొందుతున్నాయి.

అందుకే నిన్న‌టిరోజున `తేజ్ .. ఐ ల‌వ్ యు` ఆడియో వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా రామ్‌చ‌ర‌ణ్ -కె.ఎస్‌.రామారావు కాంబినేష‌న్‌లో యూనివ‌ర్శల్ మీడియా ప‌తాకంపై సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌గానే .. అంద‌రిలో ఒక‌టే ఉత్సాహం. చిరు క్లాసిక్ హిట్స్ ఛాలెంజ్‌, అభిలాష‌ల‌కు సీక్వెల్ క‌థ‌లు తెర‌కెక్కిస్తారా? ఛాలెంజ్ -2 చేస్తారా? అభిలాష 2 చేస్తారా? అంటూ అభిమానుల్లో ఒక‌టే ముచ్చ‌ట సాగింది. ధ్రువ, రంగ‌స్థ‌లం త‌ర‌వాత ప్ర‌యోగాల‌పై చ‌ర‌ణ్ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఆ క్ర‌మంలోనే అలాంటి ప్ర‌యోగం చేసేందుకు చ‌ర‌ణ్ సిద్ధ‌మ‌వుతారా? అంటూ హాట్ హాట్‌గా చ‌ర్చ సాగుతోంది. అలాంటి ప్ర‌యోగాలు చేస్తేనే నెక్ట్స్ లెవ‌ల్ హీరో అని చెప్పొచ్చు.

User Comments