కొత్త అధ్య‌క్షుడికి పెనుస‌వాళ్లు

Last Updated on by

ఫిలించాంబ‌ర్ అంటేనే స‌వాళ్ల పుట్ట‌. ఇక్క‌డ బోలెడ‌న్ని రాజకీయాల మ‌ధ్య ప‌ని చేస్తూ ఇండ‌స్ట్రీకి మేలు చేసే ప‌నులు చేయాలి. అందుకే చాంబ‌ర్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యే వ్య‌క్తి ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. తాజాగా కొత్త అధ్య‌క్షుడి ఎన్నికయ్యాడు. ఫిలించాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా పూర్వి పిక్చ‌ర్స్ అధినేత వీరినాయుడు ఏక‌గ్రీవం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన హామీలివి.. వీరినాయుడు మాట్లాడుతూ -“ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్‌గా ప‌రిశ్ర‌మ అన్ని సెక్టార్ల స‌మ‌స్య‌లు నాకు తెలుసు. ప‌రిశ్ర‌మ‌లో జీఎస్టీ స‌హా ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి. రేట్లు తారా స్థాయిలో ఉన్నాయి. వీట‌న్నిటినీ ప్ర‌భుత్వాల‌ దృష్టికి తీసుకెళ‌తాం. ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాధీశుల్ని క‌లిసి విన్న‌విస్తాం. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ అత్యున్న‌త ట్రేడ్ బాడీ అధ్య‌క్షునిగా ఎంపికైనందుకు గ‌ర్వంగా ఉంది. ఎగ్జిబిట‌ర్‌కు డిజిట‌ల్ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాలి. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల తో స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సి ఉంది. త‌క్కువ ఖ‌ర్చు ప్రొవైడ‌ర్ల‌ను ప్రోత్స‌హించాల్సి ఉంది“ అన్నారు.

డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల స‌మ‌స్య‌పై ఇదివ‌ర‌కూ ఓ పెద్ద ఉద్య‌మ‌మే జ‌రిగింది. అయినా మ‌న‌వాళ్లు ఆ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. మ‌రోవైపు త‌మిళ‌నాడులో విశాల్ వంటి హీరో కం నిర్మాత చాక‌చ‌క్యంగా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తుంటే, మ‌న‌వాళ్లు ఎందుకు ప‌రిష్క‌రించ‌లేక‌పోయారోన‌న్న చ‌ర్చ సాగింది. అయితే నూత‌న అధ్య‌క్షుడు వీట‌న్నిటికి ప‌రిష్కారం చూపిస్తారేమో చూడాలి. ఇక జీఎస్టీపైనా పెద్ద ఎత్తున పోరాడి సినీప‌రిశ్ర‌మ‌పై భారం లేకుండా చేస్తారేమో.. వేచి చూడాల్సిందే.

User Comments