ర‌ష్మిక ఏదో చేసేలా ఉందే..!

Last Updated on by

ఒక్కోసారి ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే కొంద‌రు హీరోయిన్ల‌కు కావాల్సినంత ఇమేజ్ వ‌స్తుంటుంది. ఆ మ‌ధ్య సాయిప‌ల్ల‌వి విష‌యంలో ఇదే జ‌రిగింది. ఇక ఇప్పుడు ర‌ష్మిక మండన్న విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ భామ పేరు ఇప్పుడు తెలుగులో బాగానే మారుమోగిపోతుంది. దానికి కార‌ణం కిరిక్ పార్టీ. ఎక్క‌డో క‌న్న‌డ సినిమాలో న‌టించినా కూడా ఒక్క సినిమాతోనే కావాల్సినంత పేరు తెచ్చేసుకుంది ఈ భామ‌. అక్క‌డ కిరిక్ పార్టీ త‌ర్వాత వ‌ర‌స‌గా స్టార్ హీరోలతో న‌టించింది ఈ భామ‌. ఈ చిత్ర షూటింగ్ న‌డుస్తున్న స‌మ‌యంలోనే హీరో క‌మ్ డైరెక్ట‌ర్ రక్షిత్ శెట్టి తో ప్రేమలో ప‌డిపోయింది. త్వ‌ర‌లోనే ఈయ‌న్ని పెళ్లి కూడా చేసుకోబోతుంది ర‌ష్మిక‌. ఇదిలా ఉండ‌గానే తెలుగులో కెరీర్ కూడా బాగానే ప్లాన్ చేసుకుంటుంది.

Chalo Heroine Rashmika Mandanna Upcoming Telugu Movies

ఇప్ప‌టికే ఇక్క‌డ నాగ‌శౌర్య‌తో న‌టించిన ఛ‌లో విడుద‌ల అయింది. ఇందులో ర‌ష్మిక నటన అండ్ ఎక్సప్రెషన్స్ తో బాగానే ఆకట్టుకొంటుంది. ఇక దాంతోపాటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనూ ఓ సినిమాలో న‌టిస్తుంది ర‌ష్మిక మండన్న‌. దాంతోపాటు తెలుగులో మ‌రో రెండు సినిమాల్లోనూ ర‌ష్మిక‌ను తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. వ‌ర‌స సినిమాల‌తో తెలుగులోకి చాలా సైలెంట్ గా వ‌చ్చేస్తుంది ఈ కిర్రాక్ హీరోయిన్. మ‌రి టాలీవుడ్ లో ఈ భామ మాయ ఎంత‌వ‌ర‌కు కొన‌సాగుతుందో..?

User Comments