ఛ‌లో.. ఓవ‌ర్సీస్ లో రెచ్చిపో

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ ఒక్క‌రికి టైమ్ వ‌స్తుంది.. కానీ కొంద‌రికి త్వ‌ర‌గా వ‌స్తుంది. మ‌రికొంద‌రికి మాత్రం కాస్త ఆల‌స్యం అవుతుంది. కానీ రావ‌డం ఆల‌స్యం అయినా రావ‌డం మాత్రం ప‌క్కా. ఇప్పుడు ఆ టైమ్ నాగ‌శౌర్య‌కు వ‌చ్చేసింది. కెరీర్ మొద‌ట్లో కొన్ని విజ‌యాలు ప‌ల‌కరించినా కూడా కుర్రాడు నిల‌బ‌డే హిట్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌నే చెప్పాలి. ఇప్పుడు ఆ టైమ్.. ఆ లోటు రెండూ తీరిపోయాయి. అది కూడా ఛ‌లో రూపంలో. వెంకీ కుడుముల తెర‌కెక్కించిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లాజిక్కులు లేని మ్యాజిక్కులా కామెడీ ఇందులో బాగా వ‌ర్క‌వుట్ అయింది. దాంతో ప్రేక్ష‌కులు కూడా ప‌డి ప‌డి న‌వ్వుకుంటున్నారు థియేట‌ర్స్ లో. ఇక నాగ‌శౌర్య కూడా కెరీర్ లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వ‌సూళ్ల విష‌యంలోనూ ఇది క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో ఛ‌లో హవా బాగా క‌నిపిస్తుంది.

ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా ర‌వితేజ ట‌చ్ చేసి చూడును పూర్తిగా డామినేట్ చేస్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే అక్క‌డ 90 ల‌క్ష‌లు ఛ‌లో ఖాతాలో ప‌డ‌గా.. ట‌చ్ చేసి చూడు లెక్క మాత్రం ఇంకా 60 ల్లోనే ఉంది. ఛ‌లో దూకుడు ఇలాగే కొన‌సాగేలా క‌నిపిస్తుంది. చూస్తుంటే అక్క‌డ ఛ‌లో ఈజీగా హాఫ్ మిలియ‌న్ అందుకునేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే నాగ‌శౌర్య‌కు చాలా పెద్ద విజ‌యం వ‌చ్చిన‌ట్లే..! మొత్తానికి ఇంటా బ‌య‌టా క‌లిపి ఈజీగా ఛ‌లో 10 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేయ‌డం ఖాయ‌మైపోయింది. ఈ చిత్రానికి నిర్మాత కూడా నాగ‌శౌర్య‌. వాళ్ల అమ్మ ఉషా మ‌ల్పూరి ఛ‌లో చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు త‌న‌యుడికి వ‌చ్చిన తొలి విజ‌యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు ఉష‌. మొత్తానికి నాగ‌శౌర్య ఇన్నాళ్ల‌కు జ‌న్యూన్ హిట్ కొట్టి గాల్లో తేలిపోతున్నాడు.

User Comments