చౌద‌రి గారి పిల్లను ప‌ట్టించుకోండ‌య్యా

Last Updated on by

చాందిని చౌద‌రి.. ఈ పేరు ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ షార్ట్ ఫిల్మ్స్ తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు మాత్రం చాందిని పేరు క‌చ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే అందులో ఆమె తోపు. కొన్ని సినిమాల్లో న‌టిస్తేనే కొంద‌రు హీరోయిన్ల‌కు గుర్తింపు రాదు. కానీ షార్ట్ ఫిల్మ్స్ తోనే కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది చాందిని చౌద‌రి. ఓ విధంగా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్ కు రారాణి. ఒక‌ప్పుడు ఏడాదికి క‌నీసం ఐదు షార్ట్ ఫిల్మ్ చేసేది ఈ ముద్దుగుమ్మ. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. తెలుగమ్మాయిల‌ను తెలుగులో ప‌ట్టించుకోర‌నే నానుడి మ‌రోసారి చాందిని విష‌యంలోనూ ప్రూవ్ అయింది. ఈ విష‌యంపై చాందిని కూడా ఇదే చెప్పింది.

Chandini Chowdary Hot Exposing For Howrah Bridge Movie

తాను తెలుగ‌మ్మాయిని కావ‌డం వ‌ల్లే త‌న‌కు అవ‌కాశాలు రావ‌ట్లేద‌ని ఓపెన్ గానే చెప్పేసింది ఈ భామ‌. అన్న‌ట్లుగానే ఇక్క‌డ ఏ హీరో క‌రుణించ‌డం లేదు ఈ పాపను. దాంతో వ‌చ్చిన ఆఫ‌ర్ల‌నే వాడేసుకుంటుంది చౌద‌రి గార‌మ్మాయి. ప్ర‌స్తుతం హౌరాబ్రిడ్జ్ సినిమా చేస్తోంది చాందిని. అందాల రాక్ష‌సి ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో హాట్ హాట్ గా ద‌ర్శ‌న‌మిస్తుంది చాందిని. సినిమాలో కూడా న‌డుమొంపుల‌తో కాక పుట్టిస్తుంది ఈ బ్యూటీ. త‌న హాట్ షోతో మ‌తులు పోగొట్టేసింది ఈ భామ‌. చాందిని తీరు చూస్తుంటే సినిమాల్లో రెచ్చిపోవ‌డానికి రెడీ అని సిగ్న‌ల్స్ ఇస్తున్న‌ట్లుంది. ఈ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా చౌద‌రి గార‌మ్మాయికి ఏ ద‌ర్శ‌కుడైనా అవ‌కాశం ఇస్తాడో లేదో చూడాలి..?

User Comments