స్వీట్ షాక్.. సాహసం డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా తర్వాత రూటు మార్చిన విషయం తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నటుడిగా అవార్డులు రివార్డులు అందుకోవడమే కాకుండా.. స్టార్ హీరోగా బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుని ఫ్యాన్స్ ను కూడా ఖుషీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ‘జై లవ కుశ’ లాంటి క్రేజీ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్.. తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత కొరటాల శివ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ను మళ్ళీ లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మధ్యలో ఇప్పుడు తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకున్న ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పాడని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఇక ఆ డైరెక్టర్ వైవిధ్యమైన సినిమాలు తీసే చంద్రశేఖర్ యేలేటి కావడంతో ఫ్యాన్స్ కు కూడా స్వీట్ షాక్ తగిలినట్లు అయింది. ఇప్పటికే.. ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, సాహసం, మనమంతా లాంటి కొత్తదనంతో కూడిన డిఫరెంట్ సినిమాలను తీసి డైరెక్టర్ గా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ నే క్రియేట్ చేసుకున్న చంద్రశేఖర్ యేలేటి కి ఇప్పుడు ఎన్టీఆర్ రూపంలో ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.
ఈ మేరకు రీసెంట్ గానే ఎన్టీఆర్ ను కలిసి చంద్రశేఖర్ యేలేటి ఓ కథను వినిపిస్తే.. ఆ స్టోరీ లైన్ విని ఇంప్రెస్ అయిపోయిన తారక్ వెంటనే దానిని డెవలప్ చేసుకుని రమ్మని చెప్పినట్లు తాజా సమాచారం. అంతేకాకుండా తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే సినిమా స్టార్ట్ చేద్దాం అని కూడా యేలేటి కి ఎన్టీఆర్ మాటిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. చివరగా మనమంతా లాంటి క్లాసిక్ తీసిన చంద్రశేఖర్ యేలేటి దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై కూర్చున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే, వచ్చే ఏడాది గాని, ఆ తర్వాత గాని, సాహసంతో కూడిన ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే చెప్పొచ్చు. దాంతో మరో కొత్తదనం నిండిన సినిమా ఎన్టీఆర్ నుంచి వస్తుందని ఖచ్చితంగా నమ్మొచ్చు.