ఈనెల 15న జాబిల్లి మీదకు దూసుకెళ్లాల్సిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని సాంకేతిక సమస్యలు కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాతావరరణం అనుకూలిస్తే ఈనెల 22న ప్రయోగం చేపడతామని ఇస్రో ప్రకటించింది. క్రయోజనిక్ ఇంజిన్ లోపం కారణంగా వాయిదా వేసామని తెలిపిన సంగతి తెలిసిందే. క్రయోజనిక్ ఇంజిన్ లోని హీలియం బాటిల్ వద్ద లీకేజేని గుర్తించిన శాస్ర్తవేత్తలు దాన్ని సరిచేసారు. ఈ నేపథ్యంలో ప్రయోగానికి 22వ తేదీగా నిర్ణయించారు. శనివారం రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదివారం సాంయంత్ర 6.43 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
సోమవారం మద్యాహ్నం 2.43 గంటలకు జీఎస్ఎల్ వీ మార్క్ 3ఎం 1 నింగిలోకి దూసుకెళ్లనుంది. ముందు సాంకేతిక కారణాల వల్ల ప్రయోగాన్ని నిలిపివేసిన నేపథ్యంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మరుసటి రోజు రాత్రి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఆ విషయాన్ని శాస్ర్తజ్ఞలు కేర్ చేయకుండా పంపిచాలని చూసారని, చివరికి కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ కావడంతో జ్యోతిష్యుల మాటలు నమ్మి ప్రయోగాన్ని వాయిదా వేసారు తప్ప! చంద్రయాన్-2 లో ఎలాంటి లోపం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకొంత మంది చంద్రగ్రహణ విషయం తెలియకపోవడం వల్లే అలా జరిగిందని అభిప్రాయపడ్డారు.