చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో గుబులు

300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన `సాహో`పై అన్ని వైపుల నుంచి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ కొంద‌రు పాజిటివ్ గా స్పందిస్తున్నా క్రిటిక్స్ లో డివైడ్ టాక్ ఇప్ప‌టికే వ‌చ్చేసింది. ఇది కేవ‌లం యావ‌రేజ్ సినిమా అని కొంద‌రు డిజాస్ట‌ర్ అని మ‌రికొంద‌రు ఇప్ప‌టికే డిక్లేర్ చేసేశారు. అయితే రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ అభిమానులు దీనిని ర‌క‌ర‌కాల కోణాల్లో చూస్తున్నారు.

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాక .. వెంట‌నే ఆ హీరో నుంచి డిజాస్ట‌ర్ గ్యారెంటీ. సెంటిమెంటు ప‌రిశ్ర‌మ నమ్మ‌కం ఇలానే ఉంటుంది మ‌రి. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ని ప్ర‌స్తుతం ఈ ఫ్యాక్ట‌ర్ కంగారు పెట్టేస్తోంది. ఎన్నో హోప్స్ న‌డుమ ప్ర‌భాస్ `సాహో` నేడు రిలీజైంది. బాహుబ‌లి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సిరీస్ త‌ర్వాత అంతే క్రేజుతో రిలీజైన ఈ సినిమాకి స‌మీక్ష‌లు నెగెటివ్ గా వ‌చ్చాయి. రాజ‌మౌళితో ప‌ని చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టిన హీరోల జాబితాని తిర‌గేస్తే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, ప్ర‌భాస్, ర‌వితేజ‌, సునీల్, నితిన్, నాని లాంటి హీరోలు కెరీర్ బెస్ట్ హిట్ల‌ను అందుకున్నారు. కానీ ఆ త‌ర్వాత వెంట‌నే డిజాస్ట‌ర్ల‌ను ఫేస్ చేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌భాస్ విష‌యంలోనూ ఆ ఫేట్ నిజ‌మైంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అభిమానుల్లోనూ అదే టెన్ష‌న్ స్టార్టయ్యింది. బాహుబ‌లి 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ వ‌స్తున్నా.. సెంటిమెంటు ఎక్క‌డ దెబ్బ కొడుతుందోన‌న్న టెన్ష‌న్ ఫ్యాన్స్ లో మొద‌లైంద‌ని చెబుతున్నారు. అయితే హీరోల విష‌యంలో రాజ‌మౌళిని నిందించ‌డం స‌రికాదు కానీ.. సెంటిమెంట్ రిపీట‌వుతుంటేనే టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. ఈ సెంటిమెంట్ డీవీవీ దాన‌య్య అండ్ కోని టెన్ష‌న్ కి గురి చేస్తోంద‌న్న మాటా వినిపిస్తోంది. చెర్రీ, ఎన్టీఆర్ సెంటిమెంటును బ్రేక్ చేసిన మొన‌గాళ్లు అవ‌తారా అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.