చెర్రీ డ‌బుల్ కిక్కిస్తాడ‌ట‌

Last Updated on by

ప్ర‌తి ఫ్రేమ్ క‌ల‌ర్‌ఫుల్ గా ఉండాలి.. ఎమోష‌న్ హై లెవ‌ల్లో ఉండాలి! ఇదీ రామ్‌చ‌ర‌ణ్ కోసం బోయ‌పాటి అనుస‌రిస్తున్న వ్యూహం. ఇన్నాళ్లు త‌న‌ను కేవ‌లం మాస్ మ‌సాలా ద‌ర్శ‌కుడిగానే జ‌నం చూశారు. మ‌సాలా మ్యాన్ అంటూ క్రిటిక్స్ విమ‌ర్శించారు. ఇక అన్నిటికీ చెక్ పెట్టేసే హై రేంజ్ సినిమాని త‌న‌నుంచి ఆశించ‌వ‌చ్చ‌ని స‌న్నివేశం చెబుతోందిట‌.

రంగ‌స్థ‌లం స‌క్సెస్ కార‌ణాన్ని ప‌రిశీలించి .. బోయ‌పాటి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. అందుకే చెర్రీ సినిమాలో హై లెవ‌ల్లో ఎమోష‌న్స్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడని తెలిసింది. త‌న గ‌తానుభ‌వాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాతో ఎట్టి ప‌రిస్థితిలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందాల‌ని బోయ‌పాటి సీరియ‌స్‌గానే య‌త్నాలు చేస్తున్నాడుట‌. ఆ క్ర‌మంలోనే భారీ యాక్ష‌న్‌, మాస్ అంశాల‌కు అంతే ఎగ్జ‌యిటింగ్ ఎమోష‌న్‌ని జోడించి సీన్స్ తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను` ఫేం కియ‌రా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బీహార్‌లో కీల‌క స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌గా ఉంటాయిట‌. సంక్రాంతి రిలీజ్ ల‌క్ష్యంగా చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేస్తున్నారు.

User Comments