పెద్దాయ‌న్ని చెర్రీ అలా చూశాడే!

Last Updated on by

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు పేరు ప్ర‌ఖ్యాతుల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ సినీయ‌వ‌నిక‌పై గొప్ప స్థాయికి విస్త‌రించిన మ‌హామ‌హుడు. సాంకేతిక‌త అంత గొప్ప‌గా అందుబాటులో లేని రోజుల్లోనే దాన‌వీర‌శూర‌క‌ర్ణ లో ఏకంగా నాలుగు పాత్ర‌లు పోషించిన ఘ‌నుడాయ‌న‌. ప్రపంచంలోనే అరుదైన న‌టుడిగా ఎన్టీఆర్‌కి పేరుంది. అంత‌టి మ‌హ‌నీయుడి వార‌సులుగా న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ నేడు `ఎన్టీఆర్‌` పేరుతో బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదంతా ఓ కోణం అనుకుంటే.. ఇప్పుడు ఇదిగో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇక్క‌డ ఏం చేస్తున్నాడో చూస్తున్నారు క‌దా?

అక్క‌డ అంద‌గాడు గ‌డ్డం అంచున అలా వేలు తాకించి సోగ్గాడిలా గోడ‌పై సెటిల‌య్యాడు. ఎన్టీఆర్ ఫోటోగ్రాఫ్‌ల‌లో ఇదో స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్‌. అభిమానులు మెచ్చిన ఫోటోగ్రాఫ్‌. ఆ ఫోటోని త‌ధేకంగా చూస్తున్నాడు చెర్రీ. అస‌లింత‌కీ ఇది ఏ ఆఫీస్‌లో ఉంది? కొణిదెల ఆఫీస్‌? ఎన్టీఆర్ ఆఫీస్‌? లేదా తార‌క్ ఇంట్లోనా? ఎక్క‌డ ఉంది? అంటూ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఆరాలు మొద‌లెట్టారు. అస‌లింత‌కీ ఈ సీన్ ఎక్క‌డ‌.. అన్న‌ది క‌నుక్కుని తీరాలి. తార‌క్ ఈ ఫోటోని ట్వీట్ చేశారు కాబ‌ట్టి త‌న ఇంటికి వెళ్లిన‌ప్ప‌టి ఫోటోనే అయి ఉంటుంది. ఇక నంద‌మూరి తార‌క‌రామారావు అంటే ఎనలేని గౌర‌వం, ప్రేమాభిమానాల్ని క‌న‌బ‌రిచే రామ్‌చ‌ర‌ణ్ .. ఇప్పుడిలా క‌నిపించ‌డం అభిమానుల్లో మ‌రోసారి చ‌ర్చ‌కు తావిచ్చింది. తాత‌ను అభిమానించాడు కాబ‌ట్టే, ఇప్పుడు ఏకంగా మ‌న‌వ‌డు జూ.ఎన్టీఆర్‌కి స్నేహితుడ‌య్యాడా? అంటూ ముచ్చ‌ట్లు సాగుతున్నాయ్‌.

User Comments