హీటెక్కిస్తున్న చెర్రీ బిజినెస్‌

Last Updated on by

అవును మీరు వింటున్న‌ది నిజ‌మే. `రంగ‌స్థ‌లం` త‌ర‌వాత చ‌ర‌ణ్ రేంజ్ అమాంతం స్కైని ట‌చ్ చేస్తోంది. ట్రేడ్‌లో చెర్రీ ఫీవ‌ర్ ఓ రేంజులో రాజుకుపోతోంది. గోదారి బ్యాక్‌డ్రాప్ లో తెర‌కెక్కిన `రంగ‌స్థ‌లం` ఇండ‌స్ట్రీ బెస్ట్ హిట్ అందుకుని ఏకంగా 100 కోట్ల షేర్ వ‌సూళ్లతో అద‌ర‌గొట్టేసింది. దాంతో చ‌ర‌ణ్‌ న‌టించే త‌దుప‌రి చిత్రాల‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. ప్ర‌స్తుతం చెర్రీ-బోయ‌పాటి సినిమా ఏపీ-నైజాం రైట్స్‌కి 70కోట్ల ఆఫ‌ర్ వ‌చ్చిందంటే దీనిని బ‌ట్టి అత‌డి లెవ‌ల్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

కేవ‌లం ఏపీ, తెలంగాణ రైట్స్‌కే ఇంత ఉంటే, ఇక ఓవ‌ర్సీస్‌, శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ హ‌క్కులు వ‌గైరా వ‌గైరా ఏ రేంజులో ఉంటాయో చెప్పాల్సిన ప‌నేలేదు. ఆడియో స‌హా ఇత‌ర‌త్రా హ‌క్కుల‌కు డిమాండ్ నెల‌కొంది. ఇదివ‌ర‌కూ చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమా హిందీ డ‌బ్బింగ్ హ‌క్కుల‌కు భారీ మొత్తం వెచ్చించి కొనుక్కున్నారన్న ప్ర‌చారం సాగింది. తాజాగా
వి సెల్యులాయిడ్ సంస్థ ఏపీ-నైజాం హ‌క్కుల్ని 70 కోట్లు చెల్లించి కొనుక్కునేందుకు సిద్ధ‌మైంద‌న్న వార్త వెలువ‌డింది. అయితే నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌ 75కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. 70-75 కోట్ల మ‌ధ్య డీల్ క్లోజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.ఓవ‌రాల్‌గా ఏపీ, నైజాం, ఓవ‌ర్సీస్, డ‌బ్బింగ్‌, ఇత‌ర దేశాల్లో రిలీజ్ అన్నీ క‌లుపుకుని ఈ సినిమా 150కోట్ల బిజినెస్ సాగించే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నా వెలువ‌డుతోంది. ఇక‌పోతే ఈ సినిమా రిలీజ్ వ్య‌వ‌హారాల్ని ప్ర‌ఖ్యాత యు.వి.క్రియేష‌న్స్ సంస్థ చూస్తోంద‌న్న వేరొక ప్రచారం ఉంది. అయితే చెర్రీ బిజినెస్ డీల్స్ గురించి మ‌రింత స‌వివ‌రంగా తెలియాల్సి ఉంది. రంగ‌స్థ‌లంతో చెర్రీ, భ‌ర‌త్ అనే నేనుతో దాన‌య్య బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుని బోయ‌పాటితో సినిమాని స్కైలోకి తీసుకెళ్లార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

User Comments