నారీ నారీ న‌డుమ చెర్రీ

Last Updated on by

ఇరువురు భామ‌ల న‌డుమ హీరో న‌లిగిపోయే క‌థాంశాలెన్నో వెండితెర‌పై వ‌చ్చాయి. అదే త‌ర‌హా క‌థాంశాన్ని ఎంచుకుని సినిమా ఆద్య ంతం రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్ల‌డంలో మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి స్పెష‌లిస్ట్ అన‌డంల సందేహం లేదు. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి సినిమా ఆన్‌సెట్స్ ఉంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను` ఫేం కియ‌రా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌రో భామ‌గా క్యాథ‌రిన్‌ని బోయ‌పాటి ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. కేథ‌రిన్ రాక‌తో ఇరువురు భామ‌ల న‌డుమ చెర్రీ న‌లిగిపోయే పాత్ర‌నా? లేక కేథ‌రిన్‌కి కేవ‌లం ఏ ఐటెమ్ నంబ‌ర్‌నో ఆఫ‌ర్ చేశాడా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. ఇప్ప‌టికైతే మెగా ఫ్యాన్స్‌లో ఉత్క ంఠ నెల‌కొంది. `రంగ‌స్థ‌లం` లాంటి ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ అందుకున్న చ‌ర‌ణ్ ఈసారి కూడా మ‌రో భారీ యాక్ష‌న్, రొమాంటిక్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

స‌రైనోడు, జ‌య జాన‌కి నాయ‌క వంటి చిత్రాల్లో కేథ‌రిన్‌కి అవ‌కాశాలు ఇచ్చిన బోయ‌పాటి మ‌రోసారి చెర్రీ కోసం ఆ భామ‌నే బ‌రిలో దించ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 12 నుంచి ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ మొద‌లు కానుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ డ్యాన్స్ కోసం కేథరిన్ న్యూయార్క్‌లో పాపులరైన డాన్సర్ మిస్ వి దగ్గర ‘పాపింగ్ అండ్ లాకింగ్ స్ట్రీట్ స్టైల్ డాన్స్’ లో ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందుతోందిట‌.

User Comments