శ్రీయ‌ పెళ్లిలో చెర్రీ!

Last Updated on by

సెల‌బ్రిటీ పెళ్లిళ్లు ఇటీవ‌లి కాలంలో సీక్రెట్‌గానే జ‌రుగుతున్నాయి. అలాంటి ఓ సీక్రెట్ పెళ్లికి రామ్‌చ‌ర‌ణ్‌- ఉపాస‌న సైలెంట్‌గా వెళ్లి రావ‌డంపై ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లింత‌కీ ఆ సీక్రెట్ పెళ్లి ఎవ‌రిది? అంటే ..
ది గ్రేట్ బిజినెస్‌మేన్ జీవీకే మ‌న‌వ‌రాలు.. అఖిల్ మాజీ ప్రేయ‌సి శ్రీయ‌భూపాల్ పెళ్లి వేడుక కోసమేన‌న్న చ‌ర్చా సాగుతోంది.

ఈ వివాహం ఫ్యాష‌న్ పుట్టినిల్లు అయిన ప్యారిస్‌లో ఓ జ‌మీందారీ భ‌వంతిలో అంగ‌రంగ వైభ‌వంగా సాగిందిట‌. ఆ క్ర‌మంలోనే న‌వ‌వ‌ధువు, వ‌రుడిని ఆశీర్వ‌దించేందుకు చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు ప్యారిస్ వెళ్లారు. అక్క‌డ పెళ్లి వెన్యూ వ‌ద్ద నుంచి ఉపాస‌న స్వ‌యంగా కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. `మిస్ట‌ర్‌సితో మ‌ధుర‌జ్ఞాపకాలు` అంటూ ఉపాస‌న ఎమోష‌న్ అవ్వ‌డం విశేషం. చ‌ర‌ణ్‌తో స్పాట్ లోంచి ఫోటో ఒక‌టి పోస్ట్ చేసి ఈ డ్రెస్ డిజైన్ చేసిన సందీప్ ఖోస్లాకి కృత‌జ్ఞ‌త‌లు అంటూ ఉపాస‌న పోస్ట్ చేశారు. ఉపాస‌న క‌జిన్‌ని శ్రీయాభూపాల్‌ పెళ్లాడనున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక‌లోనే ఈ సంద‌డి అంతా.

User Comments