ఛార్మికి ఉన్న‌దంతా ఊస్టింగ్‌

Last Updated on by

ఇండో-పాక్ బార్డ‌ర్ క‌థాంశం… పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో `మెహ‌బూబా` చిత్రాన్ని తెర‌కెక్కించారు పూరి జ‌గ‌న్నాథ్‌. త‌న జాన‌ర్‌ని విడిచి కొత్త జాన‌ర్‌ని ట‌చ్ చేశాడు. ఈ సినిమాతో కొడుకు ఆకాశ్ పూరిని స్టార్ హీరోని చేయాల‌ని క‌ల‌గ‌న్నాడు. అందుకోసం ఏ తండ్రీ చేయ‌నంత రిస్క్ చేశాడు పూరి. త‌న‌కు ఉన్న ఇళ్ల‌లో ఓ పాత ఇంటిని అమ్మేసి మెహ‌బూబాకి పెట్టుబ‌డి పెట్టాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌పై తెర‌కెక్కించిన ఈ సినిమాకి దాదాపు 25కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చయింద‌ని ప్ర‌చార‌మైంది. ఇందులో పూరి క‌నెక్ట్స్ ఎండీ ఛార్మి 6కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టింద‌ని తెలుస్తోంది. ఆ మొత్తం తిరిగి వ‌చ్చిందా? అంటే ఇప్పుడు ఛార్మినే ఎదురు చెల్లించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు.

కథాంశం.. ఎంచుకున్న నేప‌థ్యం ఆస‌క్తి రేకెత్తించినా.. కొత్త పంథాలో ట్రీట్‌మెంట్ ఇచ్చినా `మెహ‌బూబా`ని హిట్ చేయ‌డంలో మాత్రం పూరి& ఛార్మి టీమ్ విఫ‌ల‌మైంది. బాక్సాఫీస్ వ‌ద్ద పూర్తిగా వ్య‌తిరేక ఫ‌లితం వ‌చ్చింది. ఇక ఈ సినిమా నైజాం హ‌క్కులు 9 కోట్ల‌కు కొనుక్కున్న దిల్‌రాజు తెలివిగా అడ్వాన్స్ బేసిస్‌లో హ‌క్కులు ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌ద్ధ‌తిలో న‌ష్టాలొస్తే నిర్మాత భ‌రించాలి. లాభాలొస్తే ప‌ర్సంటేజీలు, వాటాలు ఉంటాయి. మెహ‌బూబా ఫ్లాప్ అన్న‌ది క్లియ‌ర్‌క‌ట్‌గా ట్రేడ్‌లో తేలిపోయింది కాబ‌ట్టి, ఇక పూరి- ఛార్మినే న‌ష్టాలు భ‌రించాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఛార్మి ఇన్నాళ్లు సంపాదించిందంతా పూరిపై న‌మ్మ‌కంతో పెట్టుబ‌డి పెడితే ఇప్పుడిలా ఊస్టింగ్ అవ్వ‌డంపై ఫిలింన‌గ‌ర్‌లో ఒక‌టే ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకుంటున్నారు.

User Comments