ఆకాష్ పూరికి అమ్మ పాత్ర‌లో ఛార్మి!

Last Updated on by

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ కొత్త సినిమా `రొమాంటిక్` టైటిల్ తో ఇటీవ‌లే సెట్స్ కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. పూరి శిష్యుడు అనిల్ పాదూరి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. పూరి క‌థ‌, స్కీన్ ప్లే, డైలాగులు అందించి శిష్యుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించి…ప‌ర్యవేక్ష‌ణ చేస్తున్నాడు. హైద‌రాబాద్ ప‌రిసర ప్రాంతాల్లో షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే ఆకాష్ కు జోడీగా ఏ భామ‌ను ఎంపిక చేసార‌న్న‌ది మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. పూరి లెక్క‌లు ప్ర‌కారం కొత్త భామేనే తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పూరి కేవ్ వ‌ర్గాల నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. ఇందులో ఆకాష్ త‌ల్లి పాత్ర ఒక‌టి కీల‌కంగా ఉండ‌బోతుందిట‌.

ఆ పాత్ర‌కు గ్లామ‌ర్ కూడా అవ‌స‌ర‌మేన‌ని భావించి ఆ పాత్ర కోసం ఛార్మిని దింపుతున్నార‌ని కేవ్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. మ‌రి నిజం ఎంత‌న్న‌ది తేలాల్సి ఉంది. ఛార్మి యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టి కొన్ని సంవ‌త్స‌రాలు అవుతోంది. `మంత్ర‌-2` త‌ర్వాత ఓ త‌మిళ్ సినిమా లో కామియో రోల్ కు మేక‌ప్ వేసుకుని పేక‌ప్ చెప్పేసింది. త‌ర్వాత పూరి తో క‌లిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. పూరి క‌నెక్స్ట్ ను స్థాపించ‌డంలో ఆమె కీల‌క పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం ఆ సంస్థ‌కు సంబంధించిన ప‌నుల‌న్నింటిని ఆమె ద‌గ్గరుండి చూసుకుంటోంది.