ఛార్మి: పూరీతో క‌నెక్ష‌న్ నా ఇష్టం

Last Updated on by

పూరీ జ‌గ‌న్నాథ్ అంటే వెంట‌నే గుర్తొచ్చే మ‌రో పేరు ఛార్మి. గ‌త మూడేళ్లుగా అస‌లు పూరీని వ‌ద‌ల‌కుండా ప‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అత‌డి భార్య కూడా అప్పుడ‌ప్పుడూ పూరీని వ‌దిలేస్తుంది కానీ పూరీని నిమిషం కూడా వ‌ద‌ల‌ట్లేదు ఛార్మి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఛార్మి కేరాఫ్ పూరీ అంటే కూడా త‌ప్పులేదు. ఎందుకంటే పూర్తిగా పూరీ క‌నెక్ట్స్ ను ఆధీనంలోకి తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. క‌నెక్ట్స్ అని పేరులోనే ఉంది కదా అందుకే బాగానే క‌నెక్ట్ అయిపోయింది ఛార్మి.

పూరీ నీడ‌లా ఇప్పుడు ఆయ‌న చేస్తోన్న సినిమాల ప్రొడ‌క్ష‌న్ చూసుకుంటూ బిజీగా ఉంది ఈ భామ‌. దీనికోసం ఏకంగా కోట్ల‌లో జీతం తీసుకుంటుంది ఈ పంజాబి కుడి. హీరోయిన్ గా ఉన్న‌పుడు కూడా ల‌క్ష‌ల్లోనే పారితోషికం అందుకున్న ఛార్మి.. ఇప్పుడు న‌ట‌న‌కు దూరంగా ఉండి కూడా కోట్లు వెన‌కేసుకుంటుంది. దానికి పూరీ కార‌ణం అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇద్ద‌రికి ఏంటి సంబంధం అని చాలా కాలంగా ఇండ‌స్ట్రీతో పాటు బ‌య‌ట కూడా ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీనికి ఇప్పుడు స‌మాధానం ఇచ్చింది ఛార్మి. అది కూడా పూరీ స్టైల్ లోనే.. సాయంత్రం అయితే ప‌నులు మానేసి మ‌సాలా కోసం చూసే వేస్ట్ ఫెల్లోస్ కోసం తాను స్పందించాల్సిన ప‌నిలేద‌ని.. తాను బ‌త‌క‌డానికి ప‌ని చేస్తున్నాన‌ని.. అదే తాను అబ్బాయి అయితే ఎవ‌డూ ఏ ప్ర‌శ్న వేసేవాడు కాద‌ని.. ఒక‌వేళ హీరోయిన్ కాక‌పోయినా కూడా ప‌ట్టించుకోర‌ని.. కేవ‌లం తాను హీరోయిన్ అయినందుకే ఇన్ని అనుమానాలు వ‌స్తున్నాయ‌ని చెడామ‌డా అనేసింది ఈ భామ‌.

వాళ్ల‌కు ప‌నులు లేవేమో అందుకే త‌న గురించి మాట్లాడుకుంటున్నార‌ని.. త‌న‌కు మాత్రం చాలా ప‌నులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె తీరు చూస్తుంటే మీ ఇష్టం వ‌చ్చింది రాసుకోండి.. నా యిష్ట‌మొచ్చిన‌ట్లు నేనుంటా అన్న‌ట్లుంది ప‌రిస్థితి. అన్న‌ట్లు ఇప్పుడు మెహ‌బూబా ప్ర‌మోష‌న్స్ కూడా అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది ఛార్మి.

User Comments