పూరీ కనెక్ట్స్ ను ఛార్మి ఎక్కడికో తీసుకెళ్తుందండోయ్

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనే బ్రాండ్ ను కాపాడుకోవడానికి కష్టపడుతున్న టాలెంటెడ్ పూరీ జగన్నాథ్ – హీరోయిన్ అనే పేరును కొంతైనా కాపాడుకోవాలుకునే హాట్ బ్యూటీ ఛార్మికి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. దానిని మనం స్నేహం, కలిసి పనిచేయడం అని అన్నా.. పూరీ – ఛార్మిలు బిహేవ్ చేసే విధానం చూస్తే చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఎవరి క్లారిటీ వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి.
ఇదిలా ఉంటే, పూరీతో కలిసి పూరీ కనెక్ట్స్ అనే కాస్టింగ్ యూనిట్ స్టార్ట్ చేసి దానికోసం బాగానే కష్టపడుతున్న ఛార్మి.. ఇదే సమయంలో పూరీ లేటెస్ట్ మూవీ ‘పైసా వసూల్’ కు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ, దాదాపుగా ప్రొడక్షన్ వర్క్ మొత్తం తన భుజాలపైనే వేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పూరీని వెనకుండి నడిపిస్తున్న దేవతగా ఛార్మి మారిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే, ఇప్పుడు పూరీ కనెక్ట్స్ ను విస్తరించే బాధ్యతను, దానికి జనాల్లోకి తీసుకెళ్లే ఆలోచనలను కూడా ఛార్మి తన భుజాలపైనే వేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఛార్మి.. పూరీ కనెక్ట్స్ ను విస్తరిస్తున్నామంటూ పెట్టిన ఓ పోస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ తాజా పోస్ట్ ప్రకారం, ఇప్పటివరకు కాస్టింగ్ కాల్ లాంటివి నిర్వహిస్తూ కొత్తవాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడం, ఛాన్స్ లు ఇప్పించడం లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్న పూరీ కనెక్ట్స్ ఇప్పుడు మరిన్ని విభాగాల్లోకి ఎంటర్ అవుతుంది. అందులో ముఖ్యంగా ఈవెంట్స్, టాలెంట్ అండ్ సెలబ్రటీ మేనేజ్మెంట్, యాడ్ ఫిలిమ్స్, మార్కెటింగ్ డిజైనింగ్, లైన్ ప్రొడక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ లాంటివి ఉండటం విశేషం. దీంతో ఇప్పుడు పూరీ కనెక్ట్స్ ను ఛార్మి ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు అయింది. మరి ఈ విషయంలో అసలు ఛార్మి వెనకుండి పూరీ ఇదంతా చేస్తున్నాడో లేక పూరీ వెనకే ఉండి ఛార్మి ముందుకు నడిపిస్తుందో వాళ్ళకే తెలియాలి. అంతేగాని ఇద్దరూ కలిసి ముందుకు సాగుతున్నారని మాత్రం అనకండోయ్.. జనాలు నానార్థాలు తీస్తున్నారు.