RRR పేరుతో 50 ల‌క్ష‌లు టోక‌రా

Last Updated on by

సినీ ప‌రిశ్ర‌మ‌లో మోసాలు స‌హ‌జం. మోస‌పోయే వాళ్లు ఉంటే మోసం చేసే వాళ్ల‌కు కొద‌వ లేదిక్క‌డ‌. రోజూ పోలీస్ స్టేష‌న్ల‌కు కుప్ప‌లుగా కంప్లైంట్ లు వెళ్తుంటాయి. వాటిలో ప‌రిష్కారం ఎంత వ‌ర‌కూ దొరుకుతుందో తెలియదుగానీ! తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా పేరుతో ఓ ఘ‌రానా మోసం జ‌రిగింది. ఓ వ్య‌క్తి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాన‌ని 50 లక్ష‌లకు టోక‌రా వేసాడు. ఆ మోస‌గాడి పేరు న‌రేష్. 73 ఏళ్ల వ‌య‌సున్న ఓ మ‌హిళా అడ్వ‌కేట్ కే మోసం చేసాడు. ముందుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాన‌న‌ని న‌మ్మ‌బ‌లికాడు. కొన్నాళ్ల పాటు మాట్లాడి ఆమెకు న‌మ్మ‌కాన్ని పెచాడు. నేరుగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితోనే మాట్లాడండి అంటూ వాయిస్ రికార్డు చేసి వినిపించాడు.

ఇలా త‌న తెలివి తేట‌ల‌ను ఉప‌యోగించి న‌మ్మించాడు. న‌మ్మ‌కం రావ‌డంతో ఆ మ‌హిళ 70 ల‌క్ష‌లు ఇస్తే అవ‌కాశం ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లి కాడు.న‌మ్మిన ఆమె 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను న‌రేష్ అకౌంట్ కు బ‌ధిలి చేసింది. ఆ త‌ర్వాత న‌రేష్ అదిగో ..ఇదిగో అంటూ కాల‌యాప‌న చేసాడు. దీంతో విష‌యం గ్ర‌హించిన ఆమెకు అనుమానం క‌లిగింది. వెంట‌నే పోలీసుల‌ను సంప్ర‌దించింది. ఈ విష‌యం న‌రేష్ కు తెలియ‌కుంగా జాగ్ర‌త్ప ప‌డ‌టంతో ఆ వ్య్తక్తి ప‌ట్టుబ‌డ్డాడు. ప్రస్తుతం న‌రేష్ పోలీసులు అధుపులో ఉన్నాడు. దోచుకున్న డ‌బ్బు వివ‌రాలు ఆరా తీస్తున్నారు. ఇలా చేయ‌డం ఇదే మొద‌టి సారి. గ‌తంలో కూడా ఇలాంటి మోసాల‌కు పాల్ప‌డ్డాడా? అని అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌డుతున్నారు.దీంతో సైరా యూనిట్ అలెర్ట్ అయింది. ఆ వ్య‌క్తికి..త‌మ‌కి ఎలాంటి సంబంధం లేద‌ని విర‌ణ ఇచ్చింది. త‌మ సినిమాకు ఎంపిక చేసుకునే వారి నుంచి ఎలాంటి డ‌బ్బులు తీసుకోవ‌డం లేద‌ని..ప్ర‌తిభ ఆధారంగా అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని, ఇలాంటి వారిని న‌మ్మి మోస పోవ‌ద్ద‌ని, త‌మ‌ను సంప్ర‌దించాల‌నుకుంటే నేరుగా ఆఫీస్ కు వ‌చ్చి మాట్లాడ‌వ‌ల్సింది కోరారు. 70 ఏళ్ల వ‌య‌సున్న ఆమె ఇలా డ‌బ్బులు చెల్లించి మోస‌పోవ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసారు.

User Comments