టైటిల్ – చిన్న సినిమాల్లో ‘చీమ’ సినిమా వేరు!

“చీమ – ప్రేమ మధ్యలో భామ! ”   సినిమా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు మాట్లాడుతూ “మనుషులలో మంచి మనుషులు వేరు – చిన్న సిమిమాలలో ‘చీమ’ సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావేల్టీ – అదేంటో తెలియాలంటే  మా ‘ చీమ ప్రేమ మధ్యలో భామ! ‘ సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాలి – ఫిబ్రవరి 21విడుదల” అన్నారు.

నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “ఈనాటి యూవతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణతితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుంది! అని తెలియ చేయడానికే మా ఈ చిన్న ప్రయత్నం” అని అన్నారు.

హీరో అమిత్  ” ఈ concept based సినిమాలో హీరో పాత్ర ప్రేక్షకులకు బాగా connect అవుతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది! ” అన్నారు.

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం  “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు

నటీ  నటులు :

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్.

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు

నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ