స్టార్ లిరిసిస్ట్ రాస‌లీల‌లు!

Last Updated on by

కోలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ .. పెద్ద మ‌నిషి వైర‌ముత్తు వేధింపుల‌కు పాల్ప‌డ్డారా? అంటే అవున‌నే గాయ‌ని కం డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ‌పాద ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. వైర‌ముత్తు ప‌లువురు గాయ‌నీమ‌ణుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, భ‌లాత్కారాల‌కు పాల్ప‌డ్డాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మా ఆయ‌న‌కు తెలిస్తే ఊరుకుంటారో లేదో తెలీదు.. నాపైనా అత‌డు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని, ఓసారి అత‌డి ప‌రిస‌రాల‌కు వెళ్లిన‌ప్పుడు డోర్ గ‌డియ పెట్టి గ‌ట్టిగా కౌగిలించుకున్నాడ‌ని, దాంతో భ‌య‌ప‌డి అక్క‌డి నుంచి పారిపోయాన‌ని చిన్మ‌యి ఆరోపించ‌డం సంచ‌ల‌నమైంది.

వైర‌ముత్తు స‌ర్.. ఇక మీ ప‌ని అయిపోయింది! మీ ఆకృత్యాలు ఒక‌టొక‌టిగా బ‌య‌టికొస్తాయి! అంటూ హెచ్చ‌రించిన చిన్మ‌యి వైర‌ముత్తుకు సంబంధించిన రాస‌లీల‌ల వ్య‌వ‌హారాన్ని సామాజిక మాధ్య‌మాల ద్వారా లీక్ చేయ‌డంతో ఇది ప్ర‌స్తుతం కోలీవుడ్ స‌హా అన్నిచోట్లా హాట్ టాపిక్ అయ్యింది. ఐ డోంట్ కేర్.. మునుముందు పాడ‌తానో లేదో, డ‌బ్బింగ్ చెబుతానో లేదో నాకు తెలీనే తెలీదు. ఇది నా క‌థ‌. ఇది నిజం అనీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు చిన్మ‌యి. సుచీ లీక్స్ మొద‌లు, ఇటీవ‌లి శ్రీ‌రెడ్డి లీక్స్‌, అటుపై చిన్మ‌యి లీక్స్ వ్య‌వ‌హారం పెద్ద గంద‌ర‌గోళానికే తెర‌తీస్తోంది. ఇక‌పోతే వైర‌ముత్తు అంతటి పెద్ద‌మ‌నిషి, ప‌క్కా జెంటిల్‌మేన్ ఇలా చేస్తారా? అంటూ అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయ‌న స్టార్ లిరిసిస్ట్, కీ.శే. వేటూరి సుంద‌ర రామ‌మూర్తికి స‌మ‌కాలికుడు అన్న సంగ‌తి తెలిసిందే.

User Comments