చ‌ర‌ణ్ చేద్దాం అన్నాడు..చిరు సై అన్నారు!

చారీత్రాత్మ‌క నేప‌థ్యం గ‌ల సినిమాలు చేయాల‌న్న‌ది మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్. కొన్ని ద‌శాబ్ధాలుగా అలాంటి క‌థ‌లు కోసం వెయిట్ చేసారు. చివ‌రికి ఆ డ్రీమ్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంతో తీర‌బోతుంది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, సాయి మాథ‌వ్ బుర్రా ఆ క‌థ‌కు అక్ష‌ర రూపం ఇవ్వ‌గా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సినిమా క‌థ 20 ఏళ్ల క్రిత‌మే చిరు ముందుకు వ‌చ్చిందిట‌. కానీ అప్ప‌టి ప‌రిస్థితులు..మార్కెట్ నేప‌థ్యంలో చేయ‌లేక‌పోయామ‌ని చిరు0 చెప్పారు.

రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా త‌ర్వాత మ‌నం చేయోచ్చు అన్న ధైర్యాన్ని రాజ‌మౌళి క‌ల్పించార‌ని చిరంజీవి అన్నారు. ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తితోనే సైరా చేయ‌గ‌లిగాం అన్నారు. దీనికి ముందు చ‌ర‌ణ్ ఈ సినిమా చేద్దామ‌ని నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. అప్పుడు నేను కూడా సై అని ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకున్నా. సినిమా విజ‌యం గురించి ఎప్పుడూ ఆలోచించ‌లేదు. ఇలాంటి ఒక సినిమా చేయాలి. క‌నుమ‌రుగైపోయిన ఉయ్యాల వాడ క‌థ‌ను ప్ర‌పంచానికి చాటా చెప్పాల‌న్న ఉద్దేశంతో చేసిన సినిమా అని చిరంజీవి తెలిపారు.