కాబోయే అల్లుడు పైన చిరు ఫ్యాన్స్ ఆందోళన

Last Updated on by

కాబోయే అల్లుడు.. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది క‌దా..! ఈ టైటిల్ ఎవ‌రిదో తెలిస్తే ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. హీరో ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ఇది. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ద‌ర్శ‌కుడు తేజ ఇప్పుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కు శ్రీ‌కారం చుడుతున్నాడు. తెలుగు ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా వ‌చ్చి.. అంతే వేగంగా పాతాళానికి ప‌డిపోయాడు ఉద‌య్. అప్ప‌ట్లో చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం.. ఆ త‌ర్వాత పెళ్లి క్యాన్సిల్.. ఆ వెంట‌నే ఉద‌య్ కెరీర్ త‌ల‌కిందులు అవ్వ‌డం ఇవ‌న్నీ అంద‌రికీ తెలిసిన నిజాలే. ఆ కుర్ర హీరో జీవితం అలా అర్థాంత‌రంగా ముగిసిపోవ‌డానికి కార‌ణం చిరంజీవి కుటుంబ‌మే అని అప్ప‌ట్లో జ‌నం కోడై కూశారు.

అయితే ఇప్పుడు అవ‌న్నీ ఎందుకు అనుకుంటున్నారా..? ఊరికే ఉండ‌కుండా తేజ ఇప్పుడు ఈ హీరో బ‌యోపిక్ కు శ్రీ‌కారం చుడుతున్నాడు కాబ‌ట్టి. దానికి మ‌ళ్లీ అంద‌ర్నీ గిల్లేలా కాబోయే అల్లుడు అని టైటిల్ పెడుతున్నాడు కాబ‌ట్టి..! కాబోయే అల్లుడు అంటే ఖచ్చితంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేసిన‌ట్లే అని అర్థ‌మైపోతుంది. అయితే అలా చేస్తే అభిమానులు కానీ.. ఆ కుటుంబం కానీ ఊరుకుంటుందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం. అస‌లు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ చేయాలంటే ముందు అందులో చాలా నిజాలు చూపించాలి. అవ‌న్నీ చూపిస్తే తేజ‌కు తిప్ప‌లు రాకుండా ఉంటాయా..?

User Comments