సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌లు స‌హాయం

సీనియ‌ర్ న‌టి అల్ల‌రి సుభాషిణి కొన్నాళ్లుగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుభాషిణి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్ధిక స‌హాయం చేసారు. అనంత‌రం ఆయ‌న ఫోన్ చేసి సుభాషిణి అరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య విష‌య‌మై దిగులు పడొద్ద‌ని మ‌నోధైర్యాన్ని ఇచ్చారు. కాగా ఈరోజు సాయంత్రం (బుధ‌వారం) చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వ‌యంగా సుభాషిణి ఇంటికెళ్లి రెండు ల‌క్ష‌ల చెక్ ను అందించారు.

chiranjeevi helps senior actress subhashini