ఇంత‌కీ చిరంజీవి ఎక్క‌డున్నాడు..?

Last Updated on by

ఇంత జ‌రుగుతుంది.. మెగా కుటుంబం అంతా బ‌య‌టికి వ‌చ్చింది.. ఎప్పుడూ బ‌య‌టికి రాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా మీడియా ముందుకు వ‌చ్చి మీడియా సంస్థ‌ల‌ను ఉతికి ఆరేస్తున్నాడు. ఇక నాగ‌బాబుతో పాటు మిగిలిన వాళ్లు కూడా వ‌చ్చి త‌మ మ‌ద్ద‌తు ప‌వ‌న్ కు అందిస్తున్నారు. దానికితోడు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా క‌దిలారు. ఇంత జ‌రుగుతుంటే ఒక్క‌రు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు సీన్ లో క‌నిపించ‌లేదు. అత‌డే మెగాస్టార్ చిరంజీవి. మెగా కుటుంబానికి మూల ప‌రుషుడు. ఇంత‌కీ చిరు ఎక్క‌డున్నారు..? ప‌వ‌న్ పై ఇంత కుట్ర జ‌రుగుతుంటే.. ఆయ‌న వ‌చ్చి ఫైట్ చేస్తుంటే కూడా చిరు ఎందుకు బ‌య‌టికి రావ‌డం లేదు..? దానికి కార‌ణం ఏంట‌ని అభిమానుల్లోనే కాదు ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. అయితే దీనికి స‌మాధానం కూడా ఉంది.

చిరు ప్ర‌స్తుతం ఇండియాలో లేర‌నేది వినిపిస్తున్న వార్త‌. ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల దృష్ట్యా అమెరికాలో ఉన్నారు. అందుకే సైరా షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చారు. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాతే మ‌ళ్లీ షూటింగ్ మొద‌లు కానుంది. అందుకే ఈ ఇండ‌స్ట్రీ సీన్ లో చిరు మిస్సింగ్. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాల‌ను మాత్రం చిరు తెలుసుకుంటున్నాడు. క‌చ్చితంగా దీనిపై తాను కూడా ముందుంటాన‌ని హామీ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యంపై ఎంత దూరం వెళ్ల‌డానికైనా సిద్ధంగానే ఉంటానంటూ ప‌వ‌న్ కు చిరంజీవి చెప్పిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. త‌మ్ముడి కోసం తాను కూడా రంగంలోకి దిగి స‌త్తా చూపిస్తానంటున్నాడు చిరంజీవి. మొత్తానికి మెగా కుటుంబానికి తోడు ఇప్పుడు ఇండ‌స్ట్రీ కూడా క‌ద‌ల‌డంతో ఈ ఇష్యూ ఎక్క‌డ ఆగుతుందో ఏమో తెలియ‌డం లేదు.

User Comments