Last Updated on by
ఇంతకీ ఏ విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ కరెక్ట్ అంటున్నారు అనుకుంటున్నారా..? ఇంకే విషయంలో రంగస్థలం విషయంలోనే..! ఈ సినిమాపై ముందు నుంచి ఎందుకో తెలియదు కానీ చిరంజీవికి పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న స్టైల్ నచ్చి పడిపోయాడు చిరు. మొన్న సినిమా కూడా చూసాడు మెగాస్టార్. రంగస్థలం చూసిన తర్వాత ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయ్యాడు చిరంజీవి. ఈ విషయం చరణే స్వయంగా చెప్పాడు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ సినిమా చూసిన తర్వాత చిరు ఇంకో మాటలు కూడా అన్నాడని.. అవి బయటికి రాలేదని తెలుస్తుంది.
సినిమా నిడివి మరీ మూడు గంటలు ఉంటే ప్రమాదం అని సూచించాడు మెగాస్టార్. ఎంత బాగా ఉన్నా కూడా ఈ రోజుల్లో మూడు గంటల సినిమా అంటే బోర్ కొట్టేస్తుందని.. అందుకే 25 నిమిషాల సినిమా ఎడిట్ చేయాలంటూ చిత్రయూనిట్ కు ఇప్పటికే తన అభిప్రాయం చెప్పాడని తెలుస్తుంది. కానీ సుకుమార్ కు ఇది ఇష్టం లేదు. దాంతో రామ్ చరణ్ కూడా ఎడిటింగ్ యవ్వారం వద్దనుకుంటున్నాడు. ప్రేమించి చేసారు కాబట్టి సుకుమార్, చరణ్ కు ఇది కష్టంగానే ఉండొచ్చు కానీ చిరంజీవి జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు. ఆయన చాలా సినిమాలకి దగ్గరుండి మరీ కత్తెర్లు వేయించారు. ఆ తర్వాతే సినిమాలు మంచి హిట్ అయ్యాయి కూడా. అలాంటిదిప్పుడు రంగస్థలం విషయంలో సుకుమార్, రామ్ చరణ్ మాత్రం చిరు మాటలు వినకుండా మూడు గంటల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
User Comments