చిరంజీవి.. ప‌వ‌న్.. ఎవ‌రు గొప్ప‌..?

ఇప్పుడెందుకు ఈ డిస్క‌ష‌న్ అనుకుంటున్నారా..? కానీ ఇప్పుడే ఈ డిస్క‌ష‌న్ అవ‌స‌రం. రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత చిరంజీవి ఇమేజ్ త‌గ్గింది.. ఆయ‌న‌కు ముందు ఉన్నంత క్రేజ్ లేద‌న్నారు.. కానీ ఖైదీ నెం.150తో తానెప్పుడూ మెగాస్టారే అని నిరూపించుకున్నాడు చిరంజీవి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా దిమ్మ‌తిరిగిపోయే ఇమేజ్ ఉంది. ఈయ‌న మార్కెట్ చూసి ప‌క్క హీరోలు కూడా కుళ్ల‌కుంటారు. ప్లాప్ సినిమాల‌తోనూ రికార్డ్ వ‌సూళ్లు సాధించే స‌త్తా ప‌వ‌న్ సొంతం. అయితే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి స్టామినా ఎంత‌..? ఇండ‌స్ట్రీలో ఎవ‌రు గొప్ప అనే డిస్క‌ష‌న్ ఇప్పుడు ఫ్యాన్స్ లోనే మొద‌లైంది. దానికి స‌మాధానం చిరంజీవి అనే వ‌స్తుంది. రాజ‌కీయాల్లోకి వెళ్లినా కూడా సినిమాల్లో మాత్రం మెగాస్టార్ ను మించినోళ్లు లేరనే చెప్పాలి. ఈ విష‌యంలో అన్న‌య్య కంటే చాలా అడుగులు దూరంగా ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్.

చిరంజీవికి సినిమా అంటే ప్రాణం.. గౌర‌వం.. కాదు కాదు భ‌క్తి.. భ‌యం.. అన్నీ ఉన్నాయి. కానీ ప‌వ‌న్ లో ఇవ‌న్నీ ఉన్నాయా అంటే లేవేమో అనే స‌మాధాన‌మే వ‌స్తుంది. ప‌దేళ్ల త‌ర్వాత ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన చిరంజీవి ఖైదీ నెం.150 కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు. అభిమానుల‌కు ఏం కావాలి.. త‌న నుంచి ఏం కోరుకుంటున్నారు అని అర్థం చేసుకుని 63 ఏళ్ల వ‌య‌సులోనూ చెమ‌ట చిందించాడు చిరంజీవి. ఆయ‌న క‌ష్ట‌మే ఖైదీ నెం.150ని అంత విజ‌యం సాధించేలా చేసింది. ఖైదీ సినిమా విడుద‌ల‌కు వారం రోజుల ముందు నుంచీ అంద‌రికీ ఇంట‌ర్వ్యూలు పిలిచి ఇచ్చాడు చిరంజీవి. ప్ర‌తీ ఒక్క‌రిని త‌న‌వారంటూ ప‌ల‌క‌రించాడు. సినిమా కోసం ప్రాణం పెట్టాడు.

చిరంజీవిలో ఉన్న ఈ క‌సి.. ప‌ట్టుద‌ల‌.. సినిమాపై ఇష్టం.. ఇవ‌న్నీ ప‌వ‌న్ లో క‌నిపిస్తున్నాయా..? వ‌్య‌క్తిగతంగా ప‌వ‌న్ చాలా మంచోడు.. హీరోగా క్రేజ్ ఎంతో ఉంది.. కానీ అది స‌రైన దారిలో వెళ్తుందా లేదా అనేది కావాలిక్క‌డ‌. ఉదాహ‌ర‌ణ‌కు అజ్ఞాత‌వాసి సినిమానే తీసుకోండి. ఈ సినిమా కోసం ఒక్క సారి కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు ప‌వ‌న్. ఏదో మొక్కుబ‌డిగా ఆడియో ఫంక్ష‌న్ చేసారంతే. ఇక ఒక్క ఇంట‌ర్వ్యూ అయినా ఇచ్చాడా..? అది కూడా వ‌దిలేద్దాం.. సినిమాలో ప‌వ‌న్ అస‌లు క‌ష్ట‌ప‌డ్డాడా.. క‌ష్ట‌ప‌డిన‌ట్లు అనిపించాడా..? ప్రతీ సీన్ లోనూ చాలా ఫ్రెష్ గా చెమ‌ట చిందించ‌కుండా క‌నిపించాడు ప‌వ‌ర్ స్టార్. ఒళ్లొంచ‌కుండా విజ‌యం రావాలంటే ఎలా..? త‌న‌కు సినిమాలంటే ఇష్టం లేద‌ని చెప్తాడు ప‌వ‌న్.. అలాంట‌ప్పుడు వ‌దిలేసి వెళ్ళిపోవాలి లేదంటే ఇక్క‌డే ఉంటే అభిమానులు కోరుకునే విధంగా మంచి సినిమాలు చేయాలి.. సినిమా కోసం క‌ష్ట‌ప‌డాలి. అంతేకానీ ఇలా అర‌కొర క‌థ‌లు చేసి ప్ర‌తీసారి బ‌య్య‌ర్ల‌ను బ‌లి చేయ‌కూడ‌దు క‌దా అంటున్నారు విశ్లేష‌కులు. తాజాగా అజ్ఞాత‌వాసి ఫ‌లితంతో చిరంజీవికి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న తేడా ఏంటో అంద‌రికీ స్ప‌ష్టంగా అర్థ‌మైపోయింది.