మ‌ర్డ‌ర్ ప్లాన్ వేస్తున్న చిరంజీవి..

Last Updated on by

చిరంజీవి ఏంటి.. మ‌ర్డ‌ర్ ప్లాన్ వేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజ‌మే ఇప్పుడు చిరంజీవి ఇదే ప‌నిమీదున్నాడు. ఒక‌టి రెండు రోజులు కాదు ఏకంగా 40 రోజుల పాటు ఈ మ‌ర‌ణ‌మృదంగం జ‌ర‌గ‌బోతుంది. ఇదంతా సైరా సెట్ లో జ‌ర‌గ‌బోతుంది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ జూన్ 7 నుంచి మొద‌లు కానుంది. హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా ఓ సెట్ వేసారు. ఇందులోనే నెల‌న్న‌ర రోజుల పాటు షూటింగ్ చేయ‌బోతున్నాడు సురేంద‌ర్ రెడ్డి. చిరుతో పాటు చిత్ర‌యూనిట్ అంతా పాల్గొన‌బోతుంది ఈ షెడ్యూల్లో.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా ఈ షెడ్యూల్లో ఉన్నాడు. ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి చేసే పోరాట దృశ్యాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నాడు సురేంద‌ర్ రెడ్డి. నాటు తుపాకుల‌తో పాటు మ‌రికొన్ని ఆయుధాల‌తో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ చేసిన గొరిల్లా దాడుల‌ను కూడా ఈ ఇదే షెడ్యూల్లో షూట్ చేయ‌బోతున్నారు. 2018 చివ‌రి నాటికి టాకీ పూర్తి చేస్తే.. నాలుగు నెల‌ల పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం కేటాయించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి. 200 కోట్ల‌తో రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొత్తానికి చూడాలిక‌.. ఈ మ‌ర్డ‌ర్ ప్లాన్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments