స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్న చిరంజీవి

Last Updated on by

అవునా.. అంత త‌ప్పు ఏం చేసాడు..? స‌మాధానం చెప్ప‌లేనంత ప‌ని మెగాస్టార్ ఏం చేసాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న న‌టిస్తోన్న సైరా సినిమాతోనే ఈ స‌మ‌స్య వ‌చ్చింది చిరంజీవికి. ఈ చిత్ర షూటింగ్ ప‌నుల‌న్నీ అనుకున్న‌ట్లుగానే జ‌రుగుతున్నాయి. సినిమా తొలి షెడ్యూల్ కూడా ఇప్ప‌టికే పూర్త‌యింది. ఫిబ్ర‌వ‌రి మూడో వారం నుంచి ఈ చిత్ర రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. న‌య‌న‌తార డేట్స్ కాస్త ఇబ్బందిగా మారే స‌మ‌స్య క‌నిపిస్తుంది ఈ చిత్రానికి. ఎందుకంటే ఆమె త‌మిళ‌నాట బిజీగా ఉంది. అయితే చిరు కోసం ఫిబ్ర‌వ‌రి నుంచే డేట్స్ ముందే ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ చిత్రానికి మ‌రో ఇబ్బంది కూడా ఉంది. అదే మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఉన్న‌ట్లుండి రెహ‌మాన్ త‌ప్పుకోవ‌డాన్ని చిరంజీవి అంత ఈజీగా జీర్ణించుకోలేక‌పోతున్నాడు. థ‌మ‌న్ అనుకున్నా కూడా ఇంత పెద్ద సినిమాను ఆయ‌న హ్యాండిల్ చేయ‌లేడ‌నే టాకే ఎక్కువ‌గా వినిపిస్తుంది. అందుకే మెగా ఫ్యామిలీ కూడా థ‌మ‌న్ వైపు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌నుకుంటున్నారు.

దేవీ శ్రీ ప్ర‌సాద్ కూడా హిస్టారిక‌ల్ మూవీస్ కు స‌రైన వ్య‌క్తి కాదేమో అనే వాద‌న వినిపిస్తుంది. దాంతో ఆ మ‌ధ్య కీర‌వాణిని కూడా అనుకున్నారు. ఐతే అప్ప‌ట్లో చిరు, కీర‌వాణి మధ్య‌లో చిన్న క్రియేటివ్ డిఫెరెన్సులు వ‌చ్చాయి. అప్ప‌ట్నుంచీ క‌లిసి ప‌ని చేయ‌లేదు. ఇప్పుడు కూడా చేస్తారు అనుకోవట్లేదు. దాంతో ఇప్పుడు మ‌రో ఆప్ష‌న్ కోసం చూస్తున్నారు. సైరా లాంటి సినిమాకు సంగీతం అందించే స్టామినా ఎవ‌రికి ఉంది అనుకుంటున్న త‌రుణంలో మెగాస్టార్ మ‌దిలో మెదిలిన ఆలోచ‌న ఇళ‌య‌రాజా.

అవును.. ఈ మ‌ధ్యే వెళ్లి మ్యాస్ట్రోను క‌లిసి వ‌చ్చాడు చిరు. రుద్ర‌మ‌దేవికి అద్భ‌త‌మైన సంగీతం అందించాడు ఇళ‌యారాజా. ఇప్పుడు సైరాకు కూడా ఈయ‌న అయితేనే సైరా సినిమాకు స‌రైన న్యాయం చేస్తాడంటున్నారు కొంద‌రు. దానికితోడు చిరంజీవితో ఇళ‌యారాజాది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్. ఈ క‌ల‌యికలో ఎన్ని సినిమాలు వ‌చ్చాయో లెక్క కూడా లేదు.అందుకే సైరా లాంటి సినిమాకు ఆయ‌నే క‌రెక్ట్ అంటున్నారు చిరంజీవి. సైరా రెండో షెడ్యూల్ మొద‌లు కావ‌డానికి కూడా మ‌రో రెండు వారాలు టైమ్ ఉంది. ఆ లోపు ఇళ‌య‌రాజాపై నిర్ణ‌యం తీసుకోనున్నాడు చిరంజీవి..!

User Comments