చిరంజీవికి వ‌య‌సు ఇబ్బందిగా ఉందా..?

Last Updated on by

అవును.. ఇప్పుడు చిరంజీవి చిన్న పిల్లాడేం కాదు. ఆయ‌న వ‌యసు 62 ఏళ్లు. మేక‌ప్ తో చూడ్డానికి 20 ఏళ్లు త‌గ్గిన‌ట్లు ఉంటాడేమో కానీ వ‌య‌సు మాత్రం త‌గ్గ‌దు కదా..! పాపం ఇప్ప‌టికే ఖైదీ నెం.150 లో అభిమానుల కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు సైరా కోసం కూడా అదే స్థాయిలో క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరంజీవి. అయితే ఈయ‌న‌కు వ‌య‌సు పెద్ద‌గా స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తుంది. అందుకే షూటింగ్ కూడా ఊహించిన దానికంటే మెల్ల‌గా జ‌రుగుతుంది. రోజుకు ఒక్క సీన్.. రెండు సీన్ల కంటే చిరు ఎక్కువ చేయ‌లేక‌పోతున్నార‌ని.. వెంట‌నే అలిసి పోతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. ఇందులో నిజం కూడా లేక‌పోలేదు. క‌నీసం ఏజ్ కు అయినా గౌర‌వం ఇవ్వాలి క‌దా..!

ఎంత మెగాస్టార్ అయినా.. ఎంత స‌త్తా ఉన్నా 62 ఏళ్ల‌లో క‌ష్ట‌ప‌డ‌టం అంటే మాట‌లు కాదు. పైగా ఈ చిత్రం కోసం డూప్ లేకుండా కొన్ని ఫైట్లు చేస్తున్నాడు చిరంజీవి. ఇది కూడా త‌న‌పై ప్ర‌భావం చూపిస్తుంది. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా సెట్ వేసి.. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ గ్రెగ్ పావెల్ ఆధ్వ‌ర్యంలో ఉయ్యాలవాడ బ్రిటీష్ వాళ్ల నుంచి గ‌న్స్ దొంగిలించే సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. డిసెంబ‌ర్ నాటికి సైరా షూటింగ్ పూర్తి చేయాల‌నేది చిరంజీవి ప్లాన్. మ‌రి ఆలోపు చిరు ఇంకెంత చెమ‌టోడుస్తాడో..?


Related Posts