చిరంజీవి కోపానికి కారణం సుకుమార్

Last Updated on by

నిజ‌మే.. ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కాదు. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్ గుర్తుందా.. ఈ నేచ‌ర్ లో ఎక్క‌డో జ‌రిగే ఓ మూవెంట్.. మ‌రెక్క‌డో జ‌రిగే ఓ మూవెంట్ ను డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు సైరా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఎక్క‌డో జ‌రిగే రంగ‌స్థ‌లం షూటింగ్ ఇప్పుడు సైరా షూటింగ్ ను డిసైడ్ చేస్తుంది. ఈ ఇద్ద‌రికీ కామ‌న్ ఎమోష‌న్ ర‌త్న‌వేలు. ఈయ‌న ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు. క్వాలిటీ పేరుతో సినిమాను సాగ‌దీస్తున్నాడు సుకుమార్. ఇప్ప‌టికే పూర్త‌వ్వాల్సిన షూటింగ్ మ‌రో వారం రోజులు రీ షూట్ జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. దాంతో ర‌త్న‌వేలుకు కూడా ప‌ని పెరిగింది. మ‌రోవైపు సైరా సినిమాకు కూడా డిఓపి ర‌త్న‌వేలే. ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు స‌మ‌స్య‌.

రంగ‌స్థ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో ర‌త్న‌వేలు అక్క‌డే లాక్ అయిపోయాడు. అందుకే సైరా ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌డం క‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే కేర‌ళలో జ‌ర‌గాల్సిన రెండో షెడ్యూల్ కాస్తా హైద‌రాబాద్ కు వ‌చ్చింది. ఇప్పుడు ఇది కూడా మ‌రోసారి వాయిదా ప‌డింది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఫిబ్ర‌వ‌రి 23 నుంచి సైరా రెండో షెడ్యూల్ జ‌ర‌గాల్సి ఉంది. చిరంజీవి కూడా దీనికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అది త‌న‌యుడి సినిమా కార‌ణంగానే వాయిదా ప‌డిపోయింది. మార్చ్ లో సైరా రెండో షెడ్యూల్ మొద‌లు కానుంది. అప్ప‌ట్లో సైరా తొలి షెడ్యూల్ కోసం త‌న సినిమా వాయిదా వేసుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇప్పుడు రంగ‌స్థ‌లం కోసం చిరు వెన‌క్కి త‌గ్గాడు. చెల్లుకు చెల్లు..! మార్చ్ 30న రంగ స్థ‌లం వ‌చ్చేవ‌ర‌కు సైరా ముందుకు క‌దిలేలా క‌నిపించ‌ట్లేదు.

User Comments