సైలెంట్ సైరా షూటింగ్

Last Updated on by

అవును.. హ‌డావిడి చేస్తే అది త‌ప్ప ఇంకేం ప‌ని జ‌ర‌గ‌డం లేద‌ని చిరంజీవికి అర్థ‌మైపోయిన‌ట్లుంది. అందుకే ఎలాంటి హంగు లేకుండా సింపుల్ గా సైరా రెండో షెడ్యూల్ ను మొద‌లుపెట్టేసాడు మెగాస్టార్. మొన్న‌టి వ‌ర‌కు ఎప్పుడు మొద‌ల‌వుతుందో అని కంగారు ప‌డ్డ అభిమానుల‌కు ఇప్పుడు తీపిక‌బురు అందింది. చాలా సైలెంట్ గా ఇప్పుడు సైరా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. అది ఎవ‌రూ ఊహించ‌లేదు కూడా. ఇప్ప‌ట్లో సైరా షూటింగ్ జ‌ర‌గ‌ద‌నే అనుకున్నారంతా. రంగస్థ‌లం విడుద‌లైన త‌ర్వాత కానీ చిరంజీవి మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోడేమో అనుకున్నారు కానీ అలాంటి విచిత్ర‌మేం జ‌ర‌గ‌లేదు. త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే అన్న‌ట్లుగా త‌న‌యుడి సినిమా విడుద‌ల‌కు ముందే త‌న సినిమాను మొద‌లుపెట్టాడు చిరంజీవి. ఈ షెడ్యూల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో పాటు మ‌రికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. మార్చ్ 23 నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. లేడీ సూప‌ర్ స్టార్ నయనతార కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇప్ప‌టికే సురేంద‌ర్ రెడ్డితో పాటు సైరా సెట్ లో కృష్ణ‌వంశీ కూడా క‌నిపిస్తుండ‌టం విశేషం. ఈ చిత్రంలోని కొన్ని యాక్ష‌న్ సీన్స్ ను సురేంద‌ర్ రెడ్డి కాకుండా కృష్ణ‌వంశీతో షూట్ చేయిస్తున్నాడు చిరంజీవి అంటూ అప్ప‌ట్లో కొన్ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ఇదే నిజం అయ్యేలా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ షెడ్యూల్లో కేవీ ఏం చేస్తున్నాడో.. సైరా షెడ్యూల్ బ్రేక్ లేకుండా ఎన్ని రోజులు సాగ‌నుందో చూడాలిక‌..!

User Comments